కోమలిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమేంటంటే..? - Netizens Trolling Singer Komali About Sarangadariya Song

netizens trolling singer komali comments on sarangadariya song , singer komali, sarangadariya , netizens trolling, love story song, komali viral comments, sekhar kammula, naga chaitanya, sai pallavi, sekhar master, mangli - Telugu Komali Viral Comments, Love Story Song, Mangli, Naga Chaitanya, Netizens Trolling, Sai Pallavi, Sarangadariya, Sekhar Kammula, Sekhar Master, Singer Komali

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలంగాణ జానపద గేయం కావడం, సుద్దాల అశోక్ తేజ లిరిక్స్, మంగ్లీ పాట పాడిన విధానం, సాయిపల్లవి డ్యాన్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణమయ్యాయి.

 Netizens Trolling Singer Komali About Sarangadariya Song-TeluguStop.com

అయితే ఈ పాట రిలీజైన తర్వాత కోమలి అనే సింగర్ ఈ పాటపై అన్ని హక్కులు తనకే ఉన్నాయని మంగ్లీతో పాడించడం ఏంటని వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.

అయితే కోమలి వివాదం విషయంలో కొందరు ఆమెకు మద్దతుగా నిలిస్తే మరి కొందరు మాత్రం ఆమెపై విమర్శలు చేశారు.

 Netizens Trolling Singer Komali About Sarangadariya Song-కోమలిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమేంటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న కోమలి సారంగదరియా పాట గురించి చేసిన కామెంట్ల విషయంలో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.లవ్ స్టోరీ సినిమాలో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయింది అంటూ ఆ పాట సక్సెస్ కావడం గురించి కోమలి మాట్లాడారు.

అయితే నెటిజన్లు మాత్రం ఆ పాటకు మంగ్లీ వాయిస్ బాగుందని కోమలి పాడి ఉంటే ఆ పాట ఈ స్థాయిలో సక్సెస్ అయ్యేది కాదని అభిప్రాయపడుతున్నారు.పాటను కోమలి పరిచయం చేసినా ఆ పాటను మంగ్లీనే పరిమళింపజేసిందని కామెంట్లు చేస్తున్నారు.సొంతంగా రాసిన వాళ్లు కూడా ఇన్నిసార్లు తన పాట అని చెప్పుకోరని కొంతమంది నెటిజన్లు కోమలిని తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తుండటం గమనార్హం.

కోమలి వాయిస్ తో గతంలోనే ఈ పాట రిలీజ్ అయినా ఈ పాట ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని కానీ మంగ్లీ వాయిస్ తో ఈ పాటకు గుర్తింపు వచ్చిందని.

పాటకు మంగ్లీ ప్రాణం పోసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

#Sarangadariya #Love Story Song #Singer Komali #Mangli #KomaliViral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు