రవిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. బుడబుక్కలోడిలా ఉన్నావంటూ..?

బుల్లితెరపై పదుల సంఖ్యలో షోలకు యాంకర్ గా వ్యవహరించి గుర్తింపును సంపాదించుకున్నారు రవి.ఒకవైపు యాంకర్ గా చేస్తూనే టీవీ ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొంటూ రవి వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

 Netizens Trolling Ravi And Sohel About Rrr Movie Getups-TeluguStop.com

ఉగాది పండుగ సందర్భంగా స్టార్ మా ఛానెల్ మా ఉగాది వేడుక పేరుతో ఒక ఈవెంట్ ను నిర్వహిస్తోంది.ఈ ఈవెంట్ లో యాంకర్ రవి, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సోహైల్ ఆర్ఆర్ఆర్ స్పూఫ్ చేశారు.

రవి అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపిస్తుండగా సోహైల్ కొమురం భీమ్ గెటప్ లో కనిపిస్తున్నారు.స్వాతంత్ర సమరయోధుల గెటప్స్ లో రవి, సోహైల్ కనిపిస్తుండగా నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

 Netizens Trolling Ravi And Sohel About Rrr Movie Getups-రవిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. బుడబుక్కలోడిలా ఉన్నావంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొంతమంది నెటిజన్లు రవి బుడ్దబుక్కలోడిలా ఉన్నాడంటూ, అల్లం వెల్లుల్లి అమ్ముకునే వ్యక్తిలా ఉన్నాడంటూ ట్రోల్ చేయగా సోహైల్ ను బెడ్ షీట్లు అమ్ముకునే వ్యక్తిలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరి కొందరు నెటిజన్లు రవి, సోహైల్ గెటప్స్ చూసిన తర్వాత తమకు ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తి తగ్గుతోందని చెబుతుండటం గమనార్హం.ఎన్టీఆర్, చరణ్ అద్భుతంగా నటిస్తే రవి, సోహైల్ మాత్రం ఆ పాత్రలకు సూట్ కాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఛానల్ నిర్వాహకులు చెప్పారని స్వాతంత్ర సమరయోధుల గెటప్స్ వేయవద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.

మరోవైపు పండుగ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఉద్దేశంతో ప్రతి ఛానెల్ ఈవెంట్లను ప్రసారం చేస్తోంది.

జీతెలుగు ఛానల్ ఈవెంట్ ఆదివారం రోజునే ప్రసారం కాగా ఈటీవీ, స్టార్ మా ఛానెల్ చేస్తున్న ఈవెంట్లు నేడు ప్రసారమవుతున్నాయి.

ఈవెంట్లకు మంచి టీఆర్పీ రేటింగ్ లు వస్తుండటంతో ఛానెల్ నిర్వాహకులు ఈ తరహా ప్రోగ్రామ్ లపై ఆసక్తి చూపుతున్నారు.ఈ ప్రోగ్రామ్ లు ఎంత రేటింగ్ ను సొంతం చేసుకుంటాయో తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే.

#Anchor Ravi #RaviIn #SohelIn #Ravi #Sohel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు