పుజారా, రహానేలపై పేలుతున్న సెటైర్లు.. సాగనంపాలి అంటూ నెటిజన్లు ట్రోలింగ్!

భారత క్రికెట్ సీనియర్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే ఒకప్పుడు అద్భుతమైన ఆట ప్రదర్శనతో ఓ వెలుగు వెలిగారు.అలాంటి దిగ్గజ ప్లేయర్లు ఇప్పుడు కనీస ప్రదర్శన కూడా కనబరచలేక జట్టుకు అతి పెద్ద భారంగా మారారు.

 Netizens Trolling Pujara Rahane Over Their Performance In South Africa Test Ser-TeluguStop.com

ఏ జట్టులోనైనా 11 ప్లేయర్లు మెరుగ్గా రాణించడం చాలా కీలకం.అప్పుడే టీం గెలుస్తుంది.

కానీ వీరిద్దరూ అసలు ఏమాత్రం జట్టు విజయానికి సహకరించ లేకపోతున్నారు.ఇప్పటికే వీరిద్దరి మెడలపై కత్తులు వేలాడుతూనే ఉన్నాయి.

ఇక ఆఖరిసారిగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో తమ సత్తా నిరూపించుకునేందుకు అవకాశం కల్పించింది సెలక్టర్ల కమిటీ.అయినప్పటికీ ఈ నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్ లలోనూ దారుణ ఆటతీరు కనబరిచి తీవ్ర నిరాశ పరిచారు.

మూడో టెస్టులో పుజారా, రహానే అతి తక్కువ పరుగులకే ఔటయ్యారు.దీంతో టీమిండియా ఇప్పుడు విజయానికి, అపజయానికి మధ్య పోరాడుతోంది.మూడవ టెస్టులో పుజారా తొలి ఇన్నింగ్స్ లో 43 పరుగులు సాధిస్తే, రహానే 9 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.రెండో ఇన్నింగ్స్ లో పుజారా 9 రన్స్ చేస్తే.

రహానే 1 పరుగు చేసి ఘోరంగా విఫలం అయ్యాడు.

దీంతో అభిమానులు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

సరిగ్గా ఆడలేకపోయినప్పుడు టీమ్ నుంచి తప్పుకుంటే అయిపోయేది కదా, ఇలా ఎందుకు ప్రతిసారి నిరాశపరుస్తారు? అని సోషల్ మీడియాలో అభిమానులు వీరిని ఏకిపారేస్తున్నారు.

Telugu Ajinkya Rahane, Latest, Netizens, Permance, Pujara, Purane, Rahane, Rehan

వీరిద్దరినీ టీమ్ నుంచి తక్షణమే తొలగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.PuRane (పురానే-పాతబడిన) అనే ఒక హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు.పుజారా, రహానేల పని అయిపోయిందని.

వీళ్లు ముసలోళ్లు అయిపోయారని.వీరిని సాగనంపక పోతే మ్యాచ్ లన్నీ ఓడిపోయే ప్రమాదం లేకపోలేదని కామెంట్లు పెడుతున్నారు.

వీరిద్దరిపై ఈ స్థాయిలో భారీ పోలింగ్ రావడం ఇదేం మొదటిసారి కాదు.ఎందుకంటే వీరిద్దరూ గత రెండేళ్లుగా దారుణ ఆట ప్రదర్శన కొనసాగిస్తున్నారు.

అయితే సెలక్టర్ల నెక్స్ట్ మ్యాచ్ లకు వీరిద్దరిని కచ్చితంగా తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube