ప్రభాస్ లుక్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఏమైందంటే..?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ ను తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.ఈ ఇమేజ్ వల్ల ప్రభాస్ సాహో లాంటి ఫ్లాప్ సినిమాతో కూడా సునాయాసంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించారు.

 Netizens Trolling Prabhas Look In Jati Ratnalu Trailer Launch-TeluguStop.com

ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే అంచనాలకు అందని స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.మరోవైపు ప్రభాస్ సినిమాలకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ ఏడాది ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల కానుండగా 2022లో ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాలు విడుదల కానున్నాయి.సలార్ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుండగా ఆదిపురుష్ సినిమా ఆగష్టు నెలలో విడుదల కానుంది.

కేవలం ఆరు నెలల గ్యాప్ లో ప్రభాస్ నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి.ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ పనులు ఈ ఏడాదే ప్రారంభం కానుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.

 Netizens Trolling Prabhas Look In Jati Ratnalu Trailer Launch-ప్రభాస్ లుక్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.తాజాగా ప్రభాస్ జాతిరత్నాలు సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ సమయంలో జాతిరత్నాలు చిత్రయూనిట్ తో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా ప్రభాస్ ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ప్రభాస్ ఫేస్ లో గ్లో తగ్గిందని ప్రభాస్ జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రభాస్ లుక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే సినిమాలపై ఆ ప్రభావం పడుతుందని సూచిస్తున్నారు.మరి ఫ్యాన్స్ సూచనలను ప్రభాస్ పరిగణనలోకి తీసుకుని లుక్ విషయంలో జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది.

#TrollsOn #Prabhas #Netizens #Prabhas Look #JatiRatnalu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు