మళ్లీ మంచు లక్ష్మీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమిదే..?

కరోనా సెకండ్ వేవ్ లో భారత్ లో విలయతాండవం కొనసాగుతోంది.కరోనా భయం వల్ల ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉంటున్నారు.

 Netizens Trolling Manchu Lakshmi About Her Tweet-TeluguStop.com

వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నెటిజన్లు సెలబ్రిటీలు చేసే అనవసర పోస్టుల విషయంలో సైతం తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.తాజాగా నెటిజన్లు మంచు మోహన్ బాబు కుమార్తె, ప్రముఖ నటి మంచు లక్ష్మిని ట్రోల్ చేశారు.

కొన్నిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ కు కరోనా నిర్ధారణ అయిన సమయంలో మంచు లక్ష్మి తన సినిమాలు చూడమని చేసిన పోస్ట్ కు నెటిజన్లు భారీస్థాయిలో ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.అయితే మంచు లక్ష్మీ తాజాగా 3 షాట్స్ టెక్విలాను తీసుకున్న తరువాత ఎవరైనా బ్లాక్ కాఫీని తాగుతారా.? అంటూ మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.అయితే ఆమె చేసిన ట్వీట్ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

 Netizens Trolling Manchu Lakshmi About Her Tweet-మళ్లీ మంచు లక్ష్మీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమిదే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రపంచ దేశాలు ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకుని సరైన మందులు దొరకక ఇబ్బందులు పడుతుంటే మీరు మందు గురించి ట్వీట్లు పెడతారా.? అని మంచు లక్ష్మీని నెటిజన్లు టార్గెట్ చేశారు.ప్రజలు కష్టాలు పడుతున్న నేపథ్యంలో సహాయం చేసే ప్రయత్నాలు చేయాలి తప్ప అనవసరమైన ట్వీట్లు చేస్తూ జోక్స్ వేయవద్దని మంచు లక్ష్మికి నెటిజన్లు సూచనలు చేశారు.అయితే మంచు లక్ష్మి ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోరనే సంగతి తెలిసిందే.

గతంలో నెటిజన్లు ఆమెను కొన్నిసార్లు ట్రోల్ చేసినా ఆమె ఆ ట్రోల్స్ విషయంలో మంచు లక్ష్మి సీరియస్ గా రియాక్ట్ కాలేదు.తాజా ట్రోల్స్ విషయంలో ఆమె ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.మరోవైపు గతంలో వరుస సినిమాల్లో నటించిన మంచు లక్ష్మీ ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా ఎక్కువగా నటించడం లేదనే సంగతి తెలిసిందే.

#Corona Virus #TweetAbout #NetizensAgain #Manchu Laxmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు