చరణ్ హీరోయిన్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఇదేం డ్రెస్ అంటూ..?

తెలుగులో నటించిన సినిమాలు రెండే అయినా కియారా అద్వానీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాలో అద్భుతమైన నటనతో కియారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

 Netizens Trolling Kiara Adwani Hot Photos In Social Media-TeluguStop.com

తెలుగులో తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ఆ సినిమా తరువాత కియారా నటించిన వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచినా ఆమెకు తెలుగులో ఆఫర్లు మాత్రం వచ్చాయి.

అయితే కియారా అదే సమయంలో బాలీవుడ్ ఆఫర్లతో బిజీ కావడంతో తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

 Netizens Trolling Kiara Adwani Hot Photos In Social Media-చరణ్ హీరోయిన్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఇదేం డ్రెస్ అంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమె డ్రెస్ ను చూసి ఇదేం డ్రెస్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.ఒకవైపు అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రల్లో నటిస్తూనే మరోవైపు గ్లామరస్ రోల్స్ లో కూడా నటిస్తుండటం కియారా అద్వానీ ప్రత్యేకత.

ఈ బ్యూటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Telugu Hot Photos Viral, Kiara Adwani, Kiara Hot Photos, Koratala Shiva, Negative Comments, Netizens Trolling, Ntr, Ram Charan, Shankar, Social Media-Movie

ప్రస్తుతం తెలుగులో తెరకెక్కనున్న చరణ్ శంకర్, కొరటాల శివ తారక్ సినిమాలలో హీరోయిన్ గా కియారా పేరు వినిపిస్తుండగా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.బాలీవుడ్ లో ఈ హీరోయిన్ కు బాగా గుర్తింపు ఉండటంతో ఈ హీరోయిన్ ను తమ సినిమాల్లో తీసుకోవడానికి స్టార్ డైరెక్టర్లు ఆసక్తి చూపుతున్నారు.

Telugu Hot Photos Viral, Kiara Adwani, Kiara Hot Photos, Koratala Shiva, Negative Comments, Netizens Trolling, Ntr, Ram Charan, Shankar, Social Media-Movie

కియారా ఏ హీరో సినిమాలో నటించడానికి ఓకే చెబుతుందో తెలియాల్సి ఉంది.తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న పూజా హెగ్డే, కియారా అద్వానీ బాలీవుడ్ బాట పట్టడంతో స్టార్ డైరెక్టర్లకు హీరోయిన్ల ఎంపిక క్లిష్టంగా మారింది.దీంతో టాలీవుడ్ డైరెక్టర్లు బాలీవుడ్ హీరోయిన్లపై దృష్టి పెడుతున్నారు.

#Ram Charan #Kiara Adwani #Shankar #Koratala Shiva #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు