అనసూయపై మండిపడుతున్న నెటిజన్లు! ఇంత నిర్లక్ష్యంగా ఎలా

కరోనాపై దేశం యావత్తు యుద్ధం చేస్తుంది.ఇక ఈ కరోనా స్టేజి 3లో ఉండటంతో ఇది మరింత వ్యాపించకుండా దేశంలో చాలా రాష్ట్రాలు ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.

 Netizens Trolling Anchor Anasuya On Corona Lockdown Post Corona Effect-TeluguStop.com

వీటిలో తెలంగాణ కూడా ఉంది.ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకొని ఒక నిత్యావసర వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటాయని, మిగిలినవన్నీ మూతబడి ఉంటాయని ప్రకటించారు.

ఇదే విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ లో తెలియజేశారు.ఇక ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలందరూ స్వాగతించారు.

అయితే యాంకర్ అనసూయ మాత్రం స్వాగతించలేకపోయింది.దీనిపై ట్విట్టర్ లో కేటీఆర్ పోస్ట్ పై కామెంట్స్ చేసింది.

సర్ కొన్ని వృత్తులను పరిశీలిస్తే మేము పనికి వెళ్ళలేకపోతే మేము ఆదాయాన్ని సంపాదించలేము.కానీ మేము మాత్రం యధావిధిగా ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు, ఇఎంఐలు వంటి నెలవారీ తప్పనిసరి ఖర్చులు భరించాలి.

ఇలాంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని, కొందరి విషయంలో మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని పోస్ట్ పెట్టింది.అయితే ఈ పోస్ట్ పై కేటీఆర్ స్పందించకపోయినా నెటిజన్లు మాత్రం ఆమె వాఖ్యలపై మండిపడుతున్నారు.

ఏసీ కార్లలో తిరిగే నీకు కరెంటు బిల్లు కట్టే డబ్బులు లేకుండా పోయాయా… వారం రోజులు పనికి వెళ్ళకపోతే పోయేదేమీ లేదు కానీ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి బయటకు వస్తే ప్రజల ప్రాణాలకే ముప్పు.సామాన్య, మధ్యతరగతి ప్రజలందరూ స్వాగతించిన నిర్ణయం నీకు కష్టంగా ఉందంటే నీ ఆలోచన శక్తి ఎలా ఉందో చెప్పొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంత నిర్లక్ష్యంగా, అవగాహనా రాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ విమర్శిస్తున్నారు.మరి నెటిజన్లు కామెంట్స్ పై అనసూయ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube