ఆ ఇద్ద‌రు క్రికెట‌ర్ల‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..

ఇండియాలో క్రికెట్ ను అంద‌రూ చాలా సీరియ‌స్ గా తీసుకుంటారు.ఒక‌వేళ టీమిండియా గ‌న‌క ఓడిపోతే తామేదో ఓడిపోయిన‌ట్టే ఫీల్ అవుతుంటారు.

 Netizens Trolling Ajinkya Rahane And Cheteshwar Pujara, Ajinkya Rahane, Cheteshw-TeluguStop.com

ఏదో కోల్పోయిన‌ట్టే బాధ ప‌డుతారు.కొన్ని సార్లు అభిమానుల ఆగ్ర‌హం స్టేడియంలో కూడా క‌నిపిస్తుంది.

ఒకానొక స‌మ‌యంలో వాట‌ర్ బాటిళ్ల‌ను స్టేడియంలోకి విసిరేసిన ఘ‌ట‌న‌లు కూడా మ‌నం చూశాం.అలాగే ఆట‌గాళ్ల ఇండ్ల మీద రాళ్లు విసిరిన వార్త‌లు విన్నాం.

కీల‌క‌మైన మ్యాచ్ లో గ‌న‌క ఓడిపోతే దాన్ని చాలా సీరియ‌స్ గా తీసుకుంటారు చాలామందినెటిజ‌న్లు.అలాంటి వారి వ‌ల్ల కొన్ని సార్లు క్రికెట‌ర్లు ఇబ్బందులు ప‌డుతుంటారు.

అంతెందుకు మొన్న‌టికి మొన్న పాకిస్థాన్ తో మ్యాచ్ సంద‌ర్భంగా ఓడిపోతే ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అంద‌రం చూశాం.మ‌రీ ముఖ్యంగా కోహ్లీ మీద తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయితే ఇప్పుడు న్యూజిల్యాండ్ తో ఇండియా టెస్ట్ సిరీస్ ఆడుతున్న విష‌యం తెలిసిందే.మొన్న తొలి టెస్టు నాలుగో రోజున టీమిండియా ఆట‌గాళ్లు పెద్ద‌గా ప్రభావం చూపించ‌లేక‌పోయారు.

టెస్టు లో బ్యాటింగ్ చేసిన చెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు.చాలా త‌క్కువ స్కోర్ల‌కే ప‌రిమితం అయ్యారు.

పుజారా 22 ప‌రుగులు చేస్తే, రహానె 4 ప‌రుగుల‌కు ఔట్ అయ్యాడు.

ఈ ఇద్ద‌రూ కూడా గ‌త కొంత కాలంగా ప్లాప్ అవుతున్నారు.

ఇద్ద‌రూ ఓపెన‌ర్లుగా దిగినా ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోతున్నారు.దీంతో ఇప్పుడు వారిద్ద‌రి మీద నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

వారిద్ద‌రినీ వెంట‌నే తీసేయాలంటూ పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.వీరిద్ద‌రూ ప్ర‌తిసారి ఫెయిల్ అవుతున్నార‌ని, ఇలాగే కొన‌సాగిస్తే లాభం లేదంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

వెంట‌నే వారిద్ద‌రినీ త‌ప్పించాలంటూ డిమాండ్లు కూడా తెర‌మీద‌కు తెస్తున్నారు.రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube