మంచు లక్ష్మీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కూతురు ముందే మద్యంతో..?

మంచు మోహన్ బాబు కూతురిగా, నటిగా, యాంకర్ గా ప్రతిభను చాటుకుంటూ మంచు లక్ష్మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఈ మధ్య కాలంలో సినిమాలపరంగా, టీవీ షోల పరంగా యాక్టివ్ గా లేని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.

 Netizens Trolling Actress Manchu Laxmi Why Because-TeluguStop.com

మంచు లక్ష్మి తాజాగా ఒక ఫోటోను పోస్ట్ చేయగా ఆ ఫోటోను నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తుండటం గమనార్హం.

మంచు లక్ష్మీ షేర్ చేసిన ఫోటోలో ఆమె మద్యం గ్లాసును టేబుల్ పై ఉంచుకుని కనిపించారు.

 Netizens Trolling Actress Manchu Laxmi Why Because-మంచు లక్ష్మీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కూతురు ముందే మద్యంతో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కూతురు పక్కన ఉండగానే మంచు లక్ష్మీ మద్యం గ్లాసుతో ఫోటోలు దిగడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మంచు లక్ష్మీ పిల్లల ముందు ఈ విధంగా చేయడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు.

నెటిజన్లు ఏకిపారేస్తున్న నేపథ్యంలో నెటిజన్ల విమర్శల గురించి మంచు లక్ష్మీ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

మరి కొందరు మంచు లక్ష్మీపై ఏకంగా మీమ్స్ చేసి ఆ మీమ్స్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుండటం గమనార్హం.

మంచు లక్ష్మి వ్యక్తిగత విషయాలను సైతం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉండగా తన కూతురు నిర్వాణకు మంచు లక్ష్మీ ఎక్కువ సమయం కేటాయిస్తారు.మద్యం సేవించడం తప్పు కాదని కూతురును పక్కన పెట్టుకొని తాగడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సరోగసి ద్వారా మంచు లక్ష్మీ ఈ బిడ్డను కన్నారనే సంగతి తెలిసిందే.2006 సంవత్సరంలో మంచు లక్ష్మీ ఆండీ శ్రీనివాసన్ ను వివాహం చేసుకున్నారు.సినిమాల్లో నటిగా మంచు లక్ష్మీకి మంచి పేరు వచ్చినా ఆమె ఆశించిన స్థాయిలో కెరీర్ విషయంలో సక్సెస్ కాలేదు.నిర్మాతగా కూడా మంచు లక్ష్మీ సక్సెస్ కాకపోవడం గమనార్హం.

#Why Because #ActressManchu #Wine Class #Netizens #Mohan Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు