తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటి చాందిని చౌదరి( Chandini Choudary ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తన నటనతో కొంత గుర్తింపు సొంతం చేసుకొని మంచి అభిమానం సంపాదించుకుంది.
అంతేకాకుండా తన న్యాచురల్ బ్యూటీ తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇక చాందిని కెరీర్ మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లలో నటించగా.అక్కడ మంచి సక్సెస్ అందుకోవడంతో వెండితెరపై అవకాశం అందుకుంది.వెండితెరపై అడుగుపెట్టిన మొదట్లో చాలావరకు అంత సక్సెస్ అందుకోలేకపోయింది.కానీ ఇప్పుడు మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది.
తొలిసారిగా 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో పరిచయమైంది చాందిని.ఆ తర్వాత ఏడాది ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం, కుందనపు బొమ్మ, శమంతకమణి, లై, హౌరా బ్రిడ్జి వంటి సినిమాలలో నటించగా తను నటించిన పాత్రలు అంతగా గుర్తింపు తెచ్చుకోలేనివి.
కానీ 2020 లో విడుదలైన కలర్ ఫోటో( Color Photo ) సినిమాతో మాత్రం హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది.
ఆ సినిమాతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించింది.అందులో సమ్మతమే ( Sammathame ) అనే సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నటించింది.
ఈ సినిమా తనకు మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత కూడా వరుసగా అవకాశాలు అందుకుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి అభిమానం ఉంది.ఇక ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ కూడా మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం గ్లామర్ షో కూడా చేస్తుంది.
పొట్టి పొట్టి బట్టలతో కూడా అందరికీ షాక్ ఇస్తుంది.ఇక ఈ మధ్య మంచి ఫిజిక్ సంపాదించుకోవడం కోసం బాగా వర్కౌట్లు చేసి సన్నబడింది.
నిజానికి ఈ బ్యూటీ అంతా లావుగా ఏమి ఉండకపోయేది.కానీ ఏంటో ఈమధ్య అందరిని చూసి తను కూడా సన్నగా మారాలి అని టార్గెట్ పెట్టుకొని బాగా సన్నగా మారింది.దీంతో అప్పటినుంచి గ్లామర్ షో చేయడం పెంచింది.అయితే ఈమె బాగా సన్నబడటంతో తన ఫ్యాన్స్ చూసి షాక్ అయ్యారు.మళ్లీ మునిపటిలా మారమని సలహాలు ఇచ్చారు.
కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం అలాగే ఉంది.
ఇక సన్నగా మారినప్పటి నుంచి ఈమెను చూడాలంటే కూడా చిరాకు పడుతున్నారు తన అభిమానులు.ఆమె ఏ ఫోటో షేర్ చేసుకున్నా కూడా ఏదో రకంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా ఆమె ఒక ఫోటో పంచుకోగా అందులో తన లుక్ చాలా డిఫరెంట్ గా అనిపించింది.దీంతో కొందరు నెటిజన్స్ సన్నగా మారి బొక్కలా తయారయ్యావు అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.