మనసులో మాట చెప్పమన్నారని అషు రెడ్డిని దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గతంలో బిగ్ బాస్ సీజన్ 3 షోలో పాల్గొన్న అషు తెలుగులో ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 Netizens Trolled Ashu Reddy Over Her Latest Instagram Video Ashu Reddy, Bigg Bos-TeluguStop.com

బిగ్ బాస్ ఓటీటీ అషు తన బోల్డ్ నెస్ తో అట్రాక్ట్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ డబుల్ మీనింగ్ డైలాగులతో షోలో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే.అషు రెడ్డికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.

నిత్యం సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ తరచూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రకారుకి అందాల కనువిందు చేస్తూఉంటుంది.ఇకపోతే అషు టిక్‌టాక్‌ వీడియోల ద్వారా జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఇక ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే ఎపిసోడ్ కు అతి దగ్గర్లో ఉండగా హౌస్ నుంచి ఊహించని విధంగా అషు రెడ్డి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.ఇక అప్పటి నుంచి మళ్లీ తిరిగి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తరచూ హాట్‌హాట్‌ ఫొటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్‌ చేసిన వీడియో పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.ఆమె బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ సహా కంటెస్టెంట్‌ అజయ్‌తో కలిసి మిర్చి మూవీలోని అనుష్క డైలాగ్‌పై రీల్‌ చేసింది అషు.కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకే కనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చెవారో తెలుసా.అన్న డైలాగ్ ను వీడియోలో చెబుతుంది.

ఇక అప్పుడు పక్కనే ఉన్న అజయ్‌ అషు తలపై ఒకట్టిచ్చి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ మీ మనసులోని మాటను కామెంట్‌ చేయండి అని క్యాప్షన్‌ ఇచ్చింది.దీంతో రెచ్చిపోయిన నెటిజన్లు రకరకాలుగా వారి మనసులో మాటను బయటపెడుతూ అషూను దారుణంగా ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.ముందు మేకప్‌ తీసి రీల్‌ చేయ్‌ గుర్రాలు కాదు కదా.కనీసం గాడిదలను వేసుకుని కూడా రారు అని ఒకరు కామెంట్ చేయగా ఇంకొకరు ముందు స్నానం చేయమ్మా.కంపు కొడుతోంది.ఆ తర్వాత రీల్‌ చేయ్‌ అని ఒకరు కామెంట్ చేసారు.

నీ ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్‌కి అంత సీన్ లేదులే ఇలా రకరకాలుగా దారుణంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube