ప్రముఖ దర్శకుడి బూతు సినిమాపై ట్రోల్స్‌

టాలీవుడ్‌ లో అల్లరి నుండి మొదలుకుని ఎన్నో విభిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దర్శకుడు రవిబాబు.ఈయన ప్రస్తుతం ‘క్రష్‌’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 Netizens Troll On Ravi Babu Crush Movie, Crush Movie, Ott Release, Romantic Scen-TeluguStop.com

ఇప్పటి వరకు విభిన్నమైన కథలతో తెరకెక్కించిన రవిబాబు ఈసారి కూడా క్రష్‌ సినిమాను కొత్త కథతో రూపొందిస్తున్నాడు.కాని అది కాస్త దారి తప్పినట్లుగా అనిపిస్తుంది.

చెత్త కామెడీ బూతు సీన్స్‌ వల్గర్‌ లాంగ్వేజ్‌తో సినిమాను తెరకెక్కించినట్లుగా అనిపిస్తుంది.ఇప్పటికే అతడి నుండి వచ్చిన వీడియోను చూస్తుంటే ఈ సినిమా తెలుగు సినిమా పద్దతికి మరీ దూరంగా ఉందా అనిపిస్తుంది.

మరీ బూతులు మరియు నీచమైన పదాలతో రవిబాబు సినిమాను రూపొందిస్తున్నాడు.ముగ్గరు కొత్త హీరోలు ముగ్గరు హీరోయిన్స్‌ మద్య జరిగే ప్రేమ.

శృంగారం ఇంకా అంతకు మించిన సీన్స్‌ ను దర్శకుడు రవిబాబు తనదైన శైలిలో చూపిస్తాడని వీడియో చూస్తుంటే అనిపిస్తుంది.ఒక వర్గం వారు ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తే చేస్తారేమో.

కాని చాలా మంది మాత్రం ఈ సినిమాను చూడ్డానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఈమద్య కాలంలో ఓటీటీ కోసం బూతుల డోసును పెంచుతున్నారు.

రవిబాబు తీసిన ఈ క్రష్‌ సినిమా థియేటర్‌ ఫార్మట్‌ లో లేదని, ఆయన దీన్ని థియేటర్‌ లో విడుదల చేయాలంటే సగానికి పైగా కట్‌ చేయాల్సి ఉంటుందని అంటున్నారు.దీన్ని బట్టి అర్థం అయిన విషయం ఏంటీ అంటే రవిబాబు తన క్రష్‌ సినిమాను కేవలం ఓటీటీ వేదికలో విడుదల చేయడానికే తీశాడు అనిపిస్తుంది.

కొత్త వారితో కాస్త రొమాంటిక్‌గా తీస్తేనే ఓటీటీలో కాస్త అయినా ఆధరణ దక్కతుంది.అలా కాకుండా కొత్త వారితో సినిమా తీస్తానంటే ఎవరు పట్టించుకోరు.సూపర్‌ కంటెంట్‌ ఉండి అద్బుతమైన కథతో సినిమాను తీస్తేనే మంచి ఆధరణ లభిస్తుంది.అవి లేకుండానే ప్రేక్షకుల ఆధరణ కావాలంటే ఒక రేంజ్‌ లో బూతు పెడితే చాలు అంటూ ఇప్పటికే పలు సినిమాల విషయంలో క్లారిటీ వచ్చింది.

డబ్బు సంపాదన కోసం రవిబాబు బూతు సినిమాపై పడ్డాడేమో అనిపిస్తుంది అంటూ సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.అయితే వీడియో ఒక్కటి చూసి మొత్తం సినిమాను జడ్జ్‌ చేయవద్దు.

కనుక సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్‌ చేస్తే బెటర్‌ అంటూ మరి కొందరు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube