అయ్యో పాపం రష్మిక అప్పుడే కూరలో కరివేపాకు పాత్ర అయ్యిందే  

Netizens Troll On Rashmikha Mandhana About Sarileru Nikevvaru Her Chracter - Telugu Chalo Movie Fame, Rashmikha Mandhan And Mahesh Babu, Rashmikha Mandhana, Sarileru Nikevvaru And Rashmikha Mandhana

ఛలో చిత్రంలో రష్మికకు మంచి పాత్ర దక్కింది.ఆ సినిమా విజయంలో రష్మిక పాత్ర చాలా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Netizens Troll On Rashmikha Mandhana About Sarileru Nikevvaru Her Chracter

ఇక గీత గోవిందం బ్లాక్‌ బస్టర్‌ అవ్వడంకు కూడా రష్మిక చాలా కీలక భూమిక పోషించింది.అలాంటి రష్మిక అప్పుడే కూరలో కరివేపాకులాంటి హీరోయిన్‌ పాత్రలను చేస్తోంది.

టాలీవుడ్‌లో ఎక్కువ శాతం హీరోయిన్స్‌ కథలో ప్రాముఖ్యత లేని పాత్రలను మాత్రమే చేస్తూ ఉంటారు.కాని రష్మిక మాత్రం అలా కాదు ఆమె మంచి పాత్రలు చేస్తుందని అంతా అనుకున్నారు.

కాని ఆమె సరిలేరు నీకెవ్వరు చిత్రంలో చేసిన పాత్ర విమర్శల పాలు అయ్యింది.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక చేసిన పాత్ర ఏమాత్రం ఆకట్టుకోక పోగా మరీ చిల్లరగా ఉంది అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.హీరో ప్రేమ కోసం పరితపిస్తూ చిన్న పిల్ల తరహాలో అల్లరి చేసే పాత్రలో ఈమె కనిపించింది.ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఈ సినిమా ఫలితంపై ప్రభావం చూపడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాని రష్మిక మాత్రం ఆలోచన లేకుండా మహేష్‌బాబు మూవీ అనగానే ఓకే చెప్పింది.

రష్మిక కెరీర్‌లో వరుసగా రెండు మూడు ఇలాంటి సినిమాలు చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆమెకు గుడ్‌ బై చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.రష్మిక ఓ పదేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఆమె కాస్త మంచి పాత్రలు చేయాలని, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలంటూ సినీ వర్గాల వారు సూచిస్తున్నారు.ప్రస్తుతం రష్మిక తమిళంలో ఒకటి మరియు తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది.

ఈ మూడు సినిమాల్లో రష్మిక రోల్‌ ఎలా ఉంటుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test