ఆ హీరో కోసం ఇంటి ముందు పడిగాపులుగాచిన అమ్మాయిలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!

సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు ఆ సెలబ్రెటీలను కలవడం కోసం వారి ఇంటి ముందు పడిగాపులు కాస్తారు.

 Netizens Troll Kartik Aaryan Female Fans Who Screamed His Name In Front Of His B-TeluguStop.com

అయితే ప్రస్తుతం బాలీవుడ్ హీరోల ఎంతో క్రేజ్ సంపాదించుకున్న కార్తీక్ ఆర్యన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ హీరో ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ‘ప్యార్‌ కా పంచనామా’ తో వెండితెరకు పరిచయమైన ఈ హీరో తాజాగా ధమాకా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇటీవల ‘ధమాకా‘ నెట్‌ ఫ్లిక్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది.సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నారు.

ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని చెప్పడానికి తాజాగా జరిగిన సంఘటన నిదర్శనమని చెప్పవచ్చు.తాజాగా ఈ హీరో ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు నిలబడి కార్తీక్ బయటికి రండి అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు.

Telugu Bollywood, Fans, Kartik Aaryan-Movie

ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేయడం మరికొందరు వీరి వ్యవహార శైలిని తప్పుబడుతూ వీరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘మీకు ఆత్మాభిమానం లేదా’ అని ఒకరు కామెంట్ పెట్టగా.‘అలా అరవకుండా ఇంటికి వెళ్లండి’ అని మరొకరు స్పందించారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube