వైరల్ గా మారిన రోనాల్డో ఫోటో…!  

Cristiano Ronaldo trolled for his sultry expression in luxury yacht, luxury yacht, Cristiano Ronaldo , Sunset, Twitter, Ronaldo Photo Viral, Louis Vuitton pyjama, Social Media,Netizens - Telugu Cristiano Ronaldo, Louis Vuitton Pyjama, Luxury Yacht, Netizens, Ronaldo Photo Viral, Social Media, Sunset, Twitter, Viral Photo

క్రిస్టియానో రోనాల్డో… ప్రస్తుతం ప్రపంచ ఫుట్ బాల్ ఆటగాళ్లలో ఒకరిగా పేరు పొందిన వ్యక్తి ఇతడు.సోషల్ మీడియాలో కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ పరంగా అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిఉన్న వ్యక్తిగా ఇతడు రికార్డు సృష్టించాడు.ఇకపోతే ఫోర్బ్స్ సంస్థ తాజాగా వెల్లడించిన జాబితా ప్రకారం రోనాల్డో రూ.860 కోట్ల సంపాదనతో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచాడు.మొదటి స్థానంలో మరో ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సి ఉన్నాడు.రోనాల్డో ప్రస్తుతం ఒకవైపు పోర్చుగల్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ ఉండగా… మరోవైపు ఫుట్ బాల్ క్లబ్ లీగ్స్ ఆడుతూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

TeluguStop.com - Netizens Troll Cristiano Ronaldo Photo Luxury Yacht

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళితే… తాజాగా రోనాల్డో తన ట్విట్టర్ ద్వారా పంచుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

TeluguStop.com - వైరల్ గా మారిన రోనాల్డో ఫోటో…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఈ ఫోటోలో రోనాల్డో 2000 పౌండ్లు అంటే మన భారత దేశ కరెన్సీ లో ఏకంగా కోటి 80 లక్షల రూపాయలు విలువ కలిగిన లూయిస్ సిల్క్ డ్రెస్ సెట్ వేసుకొని తన సొంత క్రూజ్ షిప్ లో దిగిన ఫోజు దర్శనమిస్తుంది.

తన సొంత క్రూజ్ షిప్ లో బాల్కనీలో కూర్చుని సన్ సెట్ ను ఎంజాయ్ చేస్తూ.వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ని జత చేశాడు క్రిస్టియానో రోనాల్డో.

అయితే ఇది వరకు బాగానే ఉన్నా… కాకపోతే, ఇప్పుడు రోనాల్డో షేర్ చేసిన ఫోటో పై నెటిజన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు.

రోనాల్డో ఎంజాయ్ చేస్తున్న అని క్యాప్షన్ పెట్టినా కూడా ఆయన ముఖంలో ఎలాంటి సంతోషం కనబడటం లేదని నెటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.

అంతేకాదు ఆయన ఫేస్ చూస్తే ఏదో బాధ అతనిని కలిచి వేస్తున్నట్లు కనబడుతోంది.ఇలా ఫేసు పెట్టి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇక మరికొందరు నెటిజన్స్ అయితే క్రిస్టియానో రోనాల్డో వేసుకున్న డ్రెస్ చూసి… ఇదేంటి మమ్మీ రోనాల్డో నీ నైటీ ఎందుకు వేసుకున్నాడు అంటూ… అలాగే మరికొందరు అచ్చం జైలు నుంచి పారిపోయిన ఖైదీలా కనిపిస్తున్నావు అంటూ మరికొందరు వారి స్టైల్స్ లో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

#LouisVuitton #Sunset #RonaldoPhoto #Social Media #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Netizens Troll Cristiano Ronaldo Photo Luxury Yacht Related Telugu News,Photos/Pics,Images..