మన్మధుడు టీజర్ చిన్మయికి ఫీవర్ గా మారింది

కింగ్ నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయింది.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Netizens Troll Chinmayi In Social Media-TeluguStop.com

నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన్మధుడు 2 ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడిగా ఉన్న రాహుల్ రవీంద్రన్ భార్య గాయకురాలు చిన్మయి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనానికి కేంద్రబిందువుగా మారిపోయింది.అదేపనిగా ఏదో ఒక విషయం మీద అ కామెంట్ చేస్తూ తన సోషల్ వెల్ఫేర్ చాటుకుంటుంది.

ఇంత వరకు బాగానే ఉన్నా ఆమె చేసిన కొన్ని విమర్శలు ఇప్పుడు తిరిగి ఆమెకే చుట్టుకున్నాయి.

కొద్ది రోజుల క్రితం చిన్మయి సోషల్ మీడియాలో హాట్ కామెంట్ చేసింది.

వయస్సు మల్లిన హీరోలు తమ కూతురు వయసు ఉండే హీరోయిన్ తో రొమాన్స్ చేయడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాధారణంగా మారిపోయింది.ఈ ట్రెండ్ ఇంకా ఆగలేదు అంటూ సెటైరికల్గా కామెంట్ చేసింది.

అయితే ఇప్పుడు తన భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మన్మధుడు 2 సినిమాకి చిన్మయి ప్రమోషన్ చేస్తుంది.దీంతో కొంతమంది సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ల్ చేయడం మొదలెట్టారు.

అప్పుడేమో హీరో హీరోయిన్ ల వయస్సు తేడాపై పెద్దపెద్ద మాటలు మాట్లాడవు… ఇప్పుడు నీ భర్త దర్శకత్వంలో తెరకెక్కే సినిమా అనేసరికి అంతా మర్చిపోయి ప్రమోట్ చేస్తున్నావు.ఇందులో కూతురి వయసున్న భామలతో జోడి కట్టడమే కాదు ముద్దులు కూడా ఉన్నాయి దీనికి నువ్వు ఏం సమాధానం చెబుతావు అంటూ గతంలో ఆమె చేసిన కామెంట్స్ ని ట్యాగ్ చేసి మరి పోస్టు పెట్టారు.

అయితే దీనిపై చిన్మయి ఎలాంటి కామెంట్ చేయక పోవడం గమనార్హం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube