బాయ్ కాట్ కంగనా... బాలీవుడ్ లో రివర్స్ అవుతున్న కంగనా పరిస్థితి

సుశాంత్ మరణం తర్వాత ఆ ఇష్యూని నెపోటిజం అనే ముసుగు తొడిగి ఇండస్ట్రీలో బంధుప్రీతి, ఒక వర్గం మాఫియా ఆగడాలు భరించలేక సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కంగనా తన గొంతు వినిపించడం మొదలు పెట్టింది.ఇక అప్పటి నుంచి ఆ సుశాంత్ ఆత్మహత్య ఇష్యూని తన వ్యక్తిగత ఎజెండా కోసం ఉపయోగించుకుంటూ బాలీవుడ్ లో తనకి నచ్చని అందరిపైన వ్యక్తిగతంగా కంగనా విమర్శల దాడి చేస్తూ వస్తుంది.

 Netizens Supports Boycott Of Kangana Ranaut, Bollywood, Sushant Singh Rajput Sui-TeluguStop.com

ప్రతి రోజు ఎవరో ఒకరిని ఈమె ఫోకస్ చేసి, పేరు పెట్టి మరీ విమర్శలు చేస్తుంది.అయితే కంగనా బాలీవుడ్ లో నెపోటిజంకి వ్యతిరేకంగా నడుపుతున్న ఉద్యమానికి మొదట్లో కొంత మద్దతు దొరికిన తరువాత అది కూడా ఆమెకి వ్యతిరేకంగా మారిపోయింది.

ఆమె తన వ్యక్తిగత ఎజెండా కోసం సుశాంత్ ఇష్యూని వాడుకుంటుంది అని గ్రహించిన వాళ్ళు కంగనాకి మద్దతుగా నిలబడటం మానేశారు.అయినా కూడా ఆమె తన పంథాని మార్చుకోకుండా సోషల్ మీడియాలో విమర్శల దాడి చేస్తూనే ఉంది.

అయితే తెగేదాకా ఏ విషయాన్ని లాగాకూడదు అనే విషయం అర్ధం కాని కంగనా నెపోటిజం విషయంలో శృతి మించి విమర్శలు చేస్తూ ఉండటంతో ఇప్పుడు బాలీవుడ్ లో మెజారిటీ వర్గం ఆమెకి వ్యతిరేకంగా మారిపోయారు.అలాగే సోషల్ మీడియాలో కూడా ఆమెకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యింది.

బాయ్ కాట్ కంగనా అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.దానిని ఉపయోగించుకొని నెటిజన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.కంగనా కేవలం తనకి నచ్చని వాళ్ళ మీద ప్రతీకారం కోసం సుశాంత్ ఆత్మహత్యని ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటుంది అని అంటున్నారు.అయితే ఈ హ్యాష్ ట్యాగ్ క్యాంపెయిన్ పైన కూడా కంగనా విమర్శలు చేశారు.

కావాలనే తనపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారని, తనని బాలీవుడ్ కి దూరం చేయాలని కొంత మంది పనిగట్టుకొని సోషల్ మీడియాలో బాయ్ కాట్ కంగనా ట్రెండ్ చేస్తున్నారని విమర్శలు చేసింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube