కుక్క తెలివికి నెటిజన్స్ షాక్.. అసలు ఏం చేసిందంటే..?

కొన్ని జంతువులు ఏం చేసినా ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.ముఖ్యంగా అవి చేసే ఫన్నీ పనులను చూస్తుంటే ముచ్చటేస్తుంది.

 Netizens Shock Dog Intelligence What Did It Actually Do Details, Dog Intelligence, Viral News, Viral Animals Video, Social Media, Intelligent Dog, Dog Playing Puzzle, Lady, Dog Video, Dog Playing-TeluguStop.com

ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మనసు కాస్త తేలిక పడుతుంది.ఎంతటి కోపంతో ఉన్న వారైనా సరే ఇలాంటి వీడియోలు చూస్తే కూల్ అయిపోతారు.

ఇప్పటి వరకు ఇలాంటి వీడియోలు మనం కూడా చాలానే చూశాం.కానీ ప్రస్తుతం ఓ కుక్క ఆడిన ఆట అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

 Netizens Shock Dog Intelligence What Did It Actually Do Details, Dog Intelligence, Viral News, Viral Animals Video, Social Media, Intelligent Dog, Dog Playing Puzzle, Lady, Dog Video, Dog Playing-కుక్క తెలివికి నెటిజన్స్ షాక్.. అసలు ఏం చేసిందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చివరి వరకు ఓడిపోకుండా తన తెలివి తేటలను ఉపయోగించింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిని చూసిన నెటిజన్స్కుక్క తెలివి తేటలను పొగడకుండా ఉండలేకపోతున్నారు.

ఆ వీడియో విషయానికి వస్తే.

ఒక కుక్క.ఒక అమ్మాయితో కలిసి ఒక ఫజిల్ ఆడుతోంది.

చెక్క ముక్కలతో ఒక ఆకారం పేర్చి ఉంది.అందులోంచి ఆ అమ్మాయి ఒక చెక్క ముక్కను తీసి పక్కన పెట్టింది.

కుక్క సైతం పైనున్న చెక్కముక్కలు కింద పడకుండా కింద ఉన్న ఒక చెక్కముక్కను తీసి పక్కన పెట్టింది.ఆ అమ్మాయి మరో సారి చెక్క ముక్కను కింది నుంచి తీసింది.

దీంతో కుక్క సైతం అదే పని చేసింది.

పైనున్న చెక్క ముక్కలు కింద పడిపోయే సమయానికి దానిని తీయడం ఆపేసింది.ఆ తర్వాత నెమ్మదిగా కింద ఉన్న చెక్క ముక్కను తీసి తన తెలివితేటలను నిరూపించుకుంది.ఆ తర్వాత ఆ అమ్మాయి.కుక్కను మెచ్చుకుంది.ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కుక్కను పొగడకుండా ఉండలేకపోతున్నారు.ఆ వీడియోపై మీరూ ఓ లుక్కెయ్యండి.

తప్పకుండా షాక్ అవుతారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube