వ‌ధువు చేసిన ప‌నికి పెండ్లి కొడుకు ఎంత ల‌క్కీనో అంటున్న నెటిజ‌న్లు..

Netizens Say How Lucky The Son Of The Bride Is For The Work Done By The Bride

ప్ర‌తి మ‌నిషి జీవితంలో పెండ్లి అనేది ఒక మ‌ధుర‌మైన అనుభూతి.చాలా సంబురంగా జ‌రుపుకునే ఓ పెద్ద పండుగ‌లాంటిది.

 Netizens Say How Lucky The Son Of The Bride Is For The Work Done By The Bride-TeluguStop.com

అయితే ఈ మ‌ధ్య పెండ్లిల సంద‌ర్భంగా వైర‌ల్ అవుతున్న వీడియోల‌ను మ‌నం చూస్తూనే ఉన్నాం.చాలామంది ఈ పెండ్లి వేడుక‌ల సంద‌ర్భంగా చేసే ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియోల‌కు మంచి క్రేజ్ కూడా ఉంది.

మ‌రీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోల‌కు అయితే నిముషాల్లోనే పాపులారిటీ వ‌చ్చేస్తోంది.అందుకే నేమో ఈ మ‌ధ్య ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఇలా డ్యాన్సులు చేసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

 Netizens Say How Lucky The Son Of The Bride Is For The Work Done By The Bride-వ‌ధువు చేసిన ప‌నికి పెండ్లి కొడుకు ఎంత ల‌క్కీనో అంటున్న నెటిజ‌న్లు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇప్పుడు కూడా ఓ వీడియోబాగా వైర‌ల్ అవుతోంది.అయితే ఇందులో అమ్మాయి ఏమీ డ్యాన్స్ చేయ‌లేదు.అబ్బాయి కూడా ఏమీ డ్యాన్స్ చేయ‌లేదు.కానీ అమ్మాయి చేసిన ప‌ని చూసిన వారంతా కూడా అబ్బాయి చాలా ల‌క్కీ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.బాగా గ్రాండ్‌గా జ‌రుగుతున్న పెండ్లిలో ఓ పెండ్లి కొడుకు మంట‌పానికి గుర్రం మీద వ‌స్తుండ‌టం మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.

డప్పులతో డ్యాన్సుల‌తో చాలామంది అత‌న్ని మంట‌పం ద‌గ్గ‌ర‌కు తీసుకువ‌స్తుంటారు.ఇది అపార్ట్‌మెంట్‌ బాల్కనీ నుంచి వ‌ధువు గ‌మ‌నిస్తుంది.

పెండ్లి కొడుకు త‌మ‌కు ద‌గ్గ‌ర‌గా రాగానే తనకు కాబోయే భర్తను చూసేందుకు చాలా ఆరాట‌ప‌డుతుంది.కానీ అత‌ను స‌రిగా క‌నిపించ‌డు.అయినా స‌రే ప‌ట్టు విడ‌వ‌కుండా చూస్తూనే ఉంటుంది.ఇక అత‌ను మాత్రం పైకి చూడ‌క‌పోవ‌డంతో ప‌క్క‌నున్న వారిని పిలిచి విషయాన్ని చెప్పమంది.ఇక వరుడు పైకి చూడ‌గానే అత‌నికి హాయ్ చెబుతుంది.ఎంతో సంబురంగా అత‌నికి సిగ్న‌ల్స్ కూడా ఇస్తుంది.

అంతే కాదు రెండు ఫ్లయింగ్‌ కిస్‌లు కూడా గాల్లోనే ఇవ్వ‌డం ఇందులో చూడొచ్చు.ఇంకేముంది ఈ వీడియోను చూసిన వారంతా ల‌క్కీ క‌పుల్స్ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.

.

#Lucky Groom #Groom

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube