కాజల్ పై సెటైర్లు వేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..?

ఈ మధ్య కాలంలో హర్రర్ కామెడీతో తెరకెక్కిన సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు.దర్శకులు కూడా అలాంటి సినిమాలను తెరకెక్కించడానికే ఆసక్తి చూపుతున్నారు.

 Netizens  Satires On Heroine Kajal Agarwal Why Because,web Seies,ira Movie,nayan-TeluguStop.com

నటి కాజల్ అగర్వాల్ నటించిన లైవ్ టెలీకాస్ట్ వెబ్ సిరీస్ ఈ నెల 12వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.తాజాగా లైవ్ టెలీకాస్ట్ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ సినిమా కాపీ అంటూ నెటిజన్లు కాజల్ పై సెటైర్లు వేస్తున్నారు.

Telugu Disney Hot, Kajal Agarwal, Netizens-Movie

స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కి మూడు సంవత్సరాల క్రితం విడుదలైన ఐరా సినిమా కథను ఈ సినిమా ట్రైలర్ పోలి ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.టీఆర్పీ రేటింగ్ కోసం ఒక ఛానల్ లేని దెయ్యం ఉందని చెప్పి పాపులర్ కావాలనే పాత్రలో నయనతార ఐరా సినిమాలో నటించగా ఈ సినిమా కథ కూడా దాదాపు ఇదే విధంగా ఉండటం గమనార్హం.

అయితే కాజల్ ఫ్యాన్స్ మాత్రం ట్రైలర్ చూసి కాజల్ కాపీ కథలో నటించిందంటూ సెటైర్లు వేయడం కరెక్ట్ కాదని వెబ్ సిరీస్ విడుదలయ్యే వరకు వేచి చూడాలని చెబుతున్నారు. దెయ్యం ఉందని నమ్మించే ప్రయత్నం చేయగా ఆ తరువాత అసలు దెయ్యం రావడంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి.

మొత్తం 9 ఎపిసోడ్లలో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.ఈ సినిమాకు కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్ ఈ సినిమాతో డిజిటల్ మీడియాలోకి అడుగు పెడుతోంది.ఈ వెబ్ సిరీస్ తనకు కచ్చితంగా మంచి పేరు తెచ్చిపెడుతుందని కాజల్ భావిస్తున్నారు.

మరి కాపీ కథ అని విమర్శలు ఎదుర్కొంటున్న ఈ వెబ్ సిరీస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube