సూపర్ ఉమెన్ కి ఐ లవ్ యూ చెప్పిన నెటిజన్.. దాంతో....

తెలుగులో ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు కాంబినేషన్ లో తెరకెక్కిన “వకీల్ సాబ్” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్న నటి లిరీషా రెడ్డి బాగానే గుర్తుంటుంది.

 Netizens Said I Love You To The Telugu Actor Lirisha Reddy Alias Super Women-TeluguStop.com

కాగా ఈ చిత్రంలో శిరీష రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ “సూపర్ ఉమెన్” అంటూ చెప్పే డైలాగులు తెగ పాపులర్ అయ్యాయి.దీంతో అప్పటినుంచి నటి లిరీషా రెడ్డికి సోషల్ మీడియాలో క్రేజ్ మరియు ఫాలోయింగ్ బాగానే పెరిగింది.

కాగా తాజాగా నటి లిరీషా రెడ్డి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించి పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

 Netizens Said I Love You To The Telugu Actor Lirisha Reddy Alias Super Women-సూపర్ ఉమెన్ కి ఐ లవ్ యూ చెప్పిన నెటిజన్.. దాంతో….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ “143 ఐ లవ్ యు మేడం” అని కామెంట్ చేశాడు.

దీంతో లిరీషా రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తూ “థాంక్యూ” అంటూ సరదాగా రిప్లై ఇచ్చింది.అలాగే తెలుగులో తన ఫేవరేట్ నటుడు ఎవరని మరో నెటిజన్ అడగగా టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు మరియు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తన ఫేవరెట్ నటుడని ఫోటోని జోడిస్తూ ద్వారా రిప్లై ఇచ్చింది.

అయితే మరో నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడని అడిగాడు.దీంతో లిరీషా రెడ్డి ఏకంగా భూమి అంటూ రిప్లై ఇచ్చింది.దీంతో ఆ నెటిజన్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.అలాగే తనకు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అని కూడా తెలిపింది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి లిరీషా రెడ్డికి తెలుగులో సినిమా అవకాశాలు బాగానే తలుపు తడుతున్నాయి.కాగా ప్రస్తుతం తెలుగులో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న “రామారావు ఆన్ డ్యూటీ” అనే చిత్రంలో లిరీషా రెడ్డి మరోమారు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.కాగా నటి లిరీషా రెడ్డి వకీల్ సాబ్ చిత్రంలో నటించడానికంటే ముందుగా దాదాపుగా 100 చిత్రాలలో నటించింది.అంతేకాకుండా పలు సీరియళ్లలో కూడా మెయిన్ లీడ్ పాత్రలలో నటించింది.

కానీ ఆమె పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.కానీ నటి లిరీషా రెడ్డి కి మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం “వకీల్ సాబ్” చిత్రం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

#Lirisha Reddy #NetizensSaid #Vakeel Sab #I Love You #Super Women

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు