త‌న పిల్ల‌ను కాపాడుకునేందుకు కుక్క చేసిన ప‌నికి ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..

ఈ సృష్టిలో త‌ల్లి ప్రేమ‌ను మించింది మ‌రేది ఉండ‌దేమో క‌దా.ఎందుకుంటే త‌న పిల్ల‌ల కోసం త‌ల్లి చేసిన‌న్ని ప‌నులు ఇంకెవ‌రూ కూడా చేయ‌లేరేమో.

 Netizens Praising Dog Work To Protect Their Children, Dog, Viral News, Mahabooba-TeluguStop.com

త‌ల్లి ప్రేమ‌కు కేవ‌లం మ‌నుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.ఏ జంతువు అయినా స‌రే త‌న పిల్ల‌ల్ని కాపాడుకునేందుకు చేసే ప్ర‌య‌త్నాలు నిజంగా క‌న్నీళ్లు తెప్పిస్తుంది.

ఇక జంతువుల్లో ఇలాంటి త‌ల్లి ప్రేమ‌కు సంబంధించిన వీడియోలు నిత్యం మ‌న‌కు సోష‌ల్ మీడియాలో ఎన్నో క‌నిపిస్తూనే ఉంటాయి.అయితే ఇప్పుడు కూడా ఓ కుక్క చేసిన పని అంద‌రితో మెచ్చుకునేలా చేస్తోంది.

సాధార‌ణంగానే కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తుంటాయి.ఇక ఇప్పుడు కురుస్తున్న కుండపోతగా కురుస్తున్నవర్షాల కారణంగా వరద‌లు వ‌స్తున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.ఇక ఈ వ‌ర‌ద‌ల నుంచి తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఆ త‌ల్లి కుక్క చేసిన పని హ్యాట్సాప్ అనేలాగే ఉంది.ఇక మహబూబాబాద్ జిల్లాలో ఇప్పుడు భారీగా వాన‌లు కురుస్తున్నాయి.

ఇక ఈ జిల్లాలోని మార్కెట్ యార్డు చుట్టూ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది.ఇక మార్కెట్ యార్డ్ వ‌ద్ద ఓ కుక్కపిల్ల త‌న త‌ల్లికోసం అర‌స్తోంది.

దాంతో త‌ల్లి వెంట‌నే దాని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది.

Telugu Dog Baby, Heavy, Mahabooba Bad, Yard, Mother Dog-Latest News - Telugu

ఇక పిల్ల ఏడుపు విన్న తల్లి కుక్క వెంట‌నే ప‌రుగులు పెడుతూ దాని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది.ఇక పిల్ల‌ను అక్క‌డ ఉంచితే లాభం లేద‌నుకుని దాన్ని నోట కరుచుకొని దాన్ని ఆ మార్కెట్ యార్డు నుంచి సురక్షిత ప్రాంతానికి గేటు దాటుకుంటూ నీటిలో నుంచి రోడ్డు అవ‌త‌లికి వెళ్లి యార్డుకు దూరంగా ఉన్న పొదల మధ్యలోకి వెళ్లింది.ఇక అక్క‌డ సుర‌క్షితంగా ఉన్న చోట త‌న పిల్లను దాచుకుంది.

దీన్ని మొత్తం ఓ వ్య‌క్తి రాసుకుని రాగా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.ఎందుకుంటే త‌ల్లి ప్రేమ‌కు అద్దం ప‌ట్టిన‌ట్టు ఉండ‌టంతో ఈ వార్త ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube