అనసూయ చేసిన పనిని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఏం జరిగిందంటే?

బుల్లితెర యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ ను తరచూ షేర్ చేసుకుంటూ వార్తల్లో నిలిచే అనసూయ చాలా సందర్భాల్లో కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.

 Netizens Praises Jabardasth Top Anchor Anasuya Why Because, Anasuya, Handloom, N-TeluguStop.com

కొన్నిసార్లు నెటిజన్ల కౌంటర్లకు అనసూయ ధీటుగా జవాబు ఇవ్వడంతో పాటు మరికొన్ని సందర్భాల్లో నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు.

అయితే తాజాగా అనసూయ చేసిన ఒక పనిని మాత్రం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

అనసూయ ముఖ్యంగా డ్రెస్ వల్ల చాలా సందర్భాల్లో వార్తల్లో నిలిచారు.తాజాగా అనసూయ తనలోని మరో కోణాన్ని నెటిజన్లకు పరిచయం చేయడం గమనార్హం.

అనసూయ చేనేత చీరకట్టులో కనిపించడంతో పాటు హ్యాండ్లూమ్ ను ప్రోత్సహించే బాధ్యతను అనసూయ తన భుజాలపై వేసుకున్నారు.

అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తాను చేనేత వస్త్రాల విషయంలో విధేయతతో ఉంటానని చెప్పుకొచ్చారు.

రోజురోజుకు చేనేత వస్త్రాలకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో వాటిని ప్రోత్సహించే దిశగా అనసూయ అడుగులు వేయడం గమనార్హం.అనసూయను నెటిజన్లు అభినందించడంతో పాటు ఫోటోలలో అనసూయ చాలా అందంగా కనిపిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం బుల్లితెరపై సుమ తర్వాత ఆ స్థాయి ప్రతిభ ఉన్న యాంకర్ గా అనసూయకు పేరుంది.జబర్దస్త్ షోతో పాటు వెండితెర ఆఫర్లతో బిజీగా ఉన్న అనసూయ టాలెంట్ ను ప్రదర్శించే అవకాశం ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నారు.సినిమాలతో బిజీగా ఉన్న ఆర్టిస్ట్ లలో అనసూయ కూడా ఒకరని చెప్పవచ్చు.సినిమాల్లో ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ అనసూయ తన పాపులారిటీని పెంచుకుంటున్నారు.స్టార్ డైరెక్టర్ సుకుమార్ సినిమాల్లో అనసూయకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ పుష్ప సినిమాలో కూడా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube