మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైందా.. అలాంటి లుక్ లో కనిపించడంతో?

చిరంజీవి, నాగార్జున వారసులు ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ తో విజయాలను అందుకుంటున్నారు.మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

 Netizens Positive Comments About Nandamuri Mokshagna Latest Photo , Boyapati Sri-TeluguStop.com

అయితే మోక్షజ్ఞ ఫోటోలపై గతంలో కొంతమంది నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.ఆ విమర్శలకు చెక్ పెట్టే విధంగా మోక్షజ్ఞ తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్నారు.

గతంతో పోలిస్తే బరువు తగ్గిన మోక్షజ్ఞ కొత్త లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.మోక్షజ్ఞకు బాలయ్య అభిమానుల సపోర్ట్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సపోర్ట్ కూడా ఉంది.

మోక్షజ్ఞ ఇప్పటికే సినిమాల్లో నటించడం కొరకు ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.కారంచేడులో మోక్షజ్ఞ గుర్రంపై ఎక్కి సందడి చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మోక్షజ్ఞ సినీ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని నందమూరి అభిమానులు సైతం ఫిక్స్ అయ్యారు.

మోక్షజ్ఞ తొలి సినిమా డైరెక్టర్ల జాబితాలో చాలామంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

మోక్షజ్ఞ తొలి సినిమాకు తనే దర్శకత్వం వహిస్తానని బాలయ్య గతంలో చెప్పినా కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మోక్షజ్ఞ హీరోగా సినిమా తెరకెక్కితే బాగుంటుందనే కామెంట్లు సైతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Telugu Boyapati Srinu, Mokshagna-Movie

బాలకృష్ణ అడిగితే బోయపాటి శ్రీను నో చెప్పే అవకాశం కూడా ఉండదు.ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాలి.దర్శకుడు బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ గురించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది.ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో బోయపాటి శ్రీనుకు ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు.

మోక్షజ్ఞ బోయపాటి కాంబినేషన్ పై బాలయ్య దృష్టి పెట్టాలని అభిమానులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube