అతడు దహీ వడ అమ్మే స్టైల్ కి నెటిజన్లు ఫిదా ..!

మీరు ఇప్పటివరకు రకరకాల దహీ వడలు తిని ఉంటారు.కానీ మీరు ఎప్పుడైనా నార్త్ ఇండియన్ పద్ధతిలో చేసే దహీ వడ రుచి చూసారా? దహీ వడ పేరుచెప్తేనే మీకు నోరూరుతుంది కదా.అవును ఈ రెసిపీ ఎంతో ఆకర్షణీయంగా, రుచికరంగా ఉంటుంది.దీన్ని ఎంతోమంది ఇష్టంగా తింటుంటారు.

 Netizens Pay Homage To His Style Of Selling Dahi Vada , Dhai Wada, Viral News,-TeluguStop.com

ఈ రెసిపీ సాధారణంగా ఉత్తర భారత దేశంలో ఎంతో ఫేమస్.కానీ ఇప్పుడు మాత్రం ఈ డిష్ దేశవ్యాప్తంగా దొరుకుతోంది.

సాయంత్రం అవ్వగానే ప్రజలు ఇష్టపడి తినే స్ట్రీట్ ఫుడ్ లో దహీ వడ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పవచ్చు.ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని చెబుతారు.

ప్రస్తుతం ‘ఫ్లయింగ్ దహీ వడ’ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.పెరుగు వడను దుకాణదారుడి అమ్మే విధానాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు.

ఈ వీడియాలో.ప్లేట్‌ని గాలిలో ఎగర వేస్తూ.దుకాణదారుడు దహీ వడను అమ్ముతున్న విధానం మనం చూడవచ్చు.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్లేట్‌లో వడ, పెరుగు రెండూ ఉన్నాయి.

అయితే.గాలిలో ప్లేట్ ఎగరవేసినా ఎక్కడా కూడా వడ కానీ, పెరుగు కానీ కిందపడిపోలేదు.

ఇలా చేయడం కూడా అరుదైన నైపుణ్యమే.ఎందుకంటే మనం సాధారణంగా ఇలా గాలిలో ప్లేట్ ఎగరవేస్తే.

అందులోని ఉన్న ఆహారపదార్ధాలు నేలమీద చెల్లాచెదురుగా పడడం ఖాయం.అయితే ఈ స్ట్రీట్ ఫుడ్ విక్రేత నైపుణ్యం .ప్లేట్ లో ఉన్న పదార్ధాలు కిందపడకున్నా.మళ్ళీ ఆ ప్లేట్ తిరిగి చేతుల్లోకి చేరుకునే విధంగా చేయడం అతనికే సొంతమని చెప్పవచ్చు.

ఈ ‘ఫ్లయింగ్ దహీ వడ’ వీడియో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కి చెందినదని తెలుస్తోంది.ఈ పెరుగు వడ ధర రూ.40.అయితే దీని ధర చాలా ఎక్కువ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube