నటుడు సోనూసూద్ పేరు తెలియని భారతీయుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.కరోనా కంటే ముందు నటుడిగా కేవలం సినీ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం ఉన్న సోనూసూద్ మొదటి సారి కరోనా సమయంలో వలస కార్మికులను ఆదుకున్న తీరుతో ఒక్కసారిగా ప్రజలందరూ సోనూసూద్ వైపు చూడడం జరిగింది.
మొదటి కరోనా వేవ్ సమయంలో లాక్ డౌన్ సమయంలో రవాణా సదుపాయం లేక చిక్కుకొని కాలినడకన వెళ్తున్న వలస కార్మికులను తన స్వంత ఖర్చులతో వారికి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఒకసారిగా వారి పట్ల దేవుడిగా మారాడు.ఇక సెకండ్ వేవ్ లో కరోనా ఎంతలా విజృంభించిందో మనం చూశాం.
అయితే ఇక ఆ సమయంలో అత్యవసరంగా ఎవరికైతే ఆక్సిజన్ అవసరం ఉన్న వారికి నిమిషాల వ్యవధిలో వారికి ఆక్సిజన్ సిలిండర్ లు అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు సోనూసూద్.ఇలా చెప్పుకుంటూ పోతే సోనూసూద్ చేసిన మంచి పనులు అనేకం ఉన్నాయని చెప్పవచ్చు.
అయితే తాజాగా సోనూసూద్ అభిమాని సైకిల్ యాత్ర చేపట్టి సోనూసూద్ ను కలిశాడు.ఇక ఆ సమయంలో ఆ అభిమాని సోనూసూద్ కు దండ వేయబోయిన సందర్భంలో వద్దని వారించి తిరిగి ఆ దండను అభిమానికి వేసి తన సింప్లిసిటీని చాటుకున్నారు సోనూసూద్.