శ్రీదేవి మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలి... అభిమానుల డిమాండ్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఈ కేసుపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేస్తున్నాయి.

 Netizens Now Demands Cbi Probe In Sridevi's Death, Tollywood, Sridevi Death, Cbi-TeluguStop.com

ఇక సుశాంత్ తండ్రి తన కొడుకు చావుకి అతని ప్రియురాలు రియా కారణం అని ఆరోపిస్తూ కేసు పెట్టారు.ఇక ఈ కేసు విచారణలో బిహార్ పోలీసులకి ముంబై పోలీసులు సహకరించకపోవడంతో ఈ కేసు విచారణ బాధ్యతలని సీబీఐకి అప్పగించాలని కోరుతూ బీహార్ ప్రభుత్వం అపీల్ చేసుకుంది.

దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి సీబీఐ విచారణకి ఒకే చెప్పింది.దీంతో సుశాంత్ ఆత్మహత్యపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సీబీఐ విచారణ మొదలు పెట్టింది.

మరో వైపు సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయం కావడంపై ఈడీ కూడా విచారణ చేస్తుంది.

ఇదిలా ఉంటే సుశాంత్ కేసు విచారణ సీబీఐ విచారణ జరుగుతూ ఉండటంతో రెండున్నరేళ్ల క్రితం దుబాయ్‌లో ప్రాణాలు కోల్పోయిన శ్రీదేవి కేసులో కూడా సీబీఐ విచారణ జరపాలని ఆమె అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం ప్రారంభించారు.

దుబాయ్ లో ఓ పెళ్లి వేడుకకి వెళ్ళిన ఆమె హోటల్ గదిలో బాత్ టబ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ఆమె లో బీపీ కారణంగా చనిపోయిందని అప్పట్లో డాక్టర్లు, పోలీసులు తేల్చేశారు.

అయితే ఆమె మృతి వెనుక ఏదో బలమైన కారణం ఉందని, లేదంటే బాత్ టబ్ లో పడి ఎలా చనిపోతుంది అంటూ ఆమె అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు.ఆమె చనిపోయి చాలా రోజుల తర్వాత ఇప్పుడు మరోసారి శ్రీదేవి మృతిపై ఆమె అభిమానులు న్యాయ విచారణ కోరుతూ సోషల్ మీడియాలో కాంపైన్ నిర్వహిస్తున్నారు.

ఆగ‌స్టు 13న శ్రీదేవి జయంతి ఉండడం వంటి అంశాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆమె అభిమానులు సీబీఐ ఎంక్వైరీ ఫ‌ర్ శ్రీదేవి హ్యాష్ ట్యాగ్‌తో ఆమె మృతిపై విచారణ కోసం డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube