కొత్త ఇల్లుని చూపించిన యాంకర్.. దాంతో  మోసం చేసిన డబ్బుతో కడుతున్నారా అంటూ....

తెలుగులో పలు, షోలు ఈవెంట్లలో తన గలగల మాటలతో ప్రేక్షకులను బాగానే అలరించిన టాలీవుడ్ ప్రముఖ బ్యూటిఫుల్ యాంకర్ శ్యామల గురించి సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే యాంకర్ శ్యామల సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో చాలా కష్టాలు పడింది.

 Netizens Negative Trolls On Anchor Shyamala New Home, Telugu Anchor, Shyamala, N-TeluguStop.com

అయినప్పటికీ పట్టు విడవకుండా శ్రమించి ప్రస్తుతం సెలబ్రిటీ హోదాను దక్కించుకుని బాగానే లైఫ్ లీడ్ చేస్తోంది.అయితే తాజాగా యాంకర్ శ్యామల కొత్తగా నిర్మిస్తున్న ఇంటి గురించి ఓ వీడియో ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

కానీ ఈ వీడియోని చూసినటువంటి కొందరు నెటిజన్లు అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా ఇటీవలే యాంకర్ శ్యామల భర్తని డబ్బులు చీటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.దీంతో కొందరు నెటిజన్లు యాంకర్ శ్యామల కొత్త ఇంటి వీడియోపై స్పందిస్తూ “నీ భర్త మోసం చేసి కొట్టేసిన డబ్బుతోనే ఇల్లు కడుతున్నారా…? అంటూ అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారు.దీంతో యాంకర్ శ్యామల అభిమానులు మాత్రం అసలు విషయం తెలియకుండా సినీ సెలబ్రిటీలపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా గతంలో యాంకర్ శ్యామల భర్త నరసింహ డబ్బులు చీటింగ్ కేసులో కేవలం అభియోగాలు మాత్రమే ఉన్నాయని కానీ ఇప్పటివరకు అతడు డబ్బు మోసానికి పాల్పడినట్లు నిరూపితం కాలేదని కాబట్టి ఏదైనా ఒక విషయం పై మాట్లాడేటప్పుడు పూర్తిగా అవగాహనతో మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Smiha, Netizens Trolls, Netizenstrolls, Serial, Shyamala, Telugu Anchor,

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ శ్యామల పలు ఈవెంట్లలో, షోలలో యాంకరింగ్ నిర్వహిస్తూ మరోపక్క టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తోంది.శ్యామల భర్త నరసింహ కూడా పలు సీరియళ్లలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube