ఏదేమైనా రామ్ గోపాల్ వర్మ కి లేడీస్ వీక్నెస్ కొంచెం ఎక్కువే...

తెలుగులో ఎప్పుడూ విభిన్న కథనాలు ఎంచుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ తన చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు “రామ్ గోపాల్ వర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ తో ప్రేక్షకులని పలకరిస్తూనే ఉంటాడు.

 Netizens Negative Troll Ram Gopal Varma Interview With Youtube Channel Anchor, R-TeluguStop.com

 కాగా తాజాగా రామ్ గోపాల్ వర్మ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఇంటర్వ్యూ చేసేటువంటి యాంకర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా ఇందులో రామ్ గోపాల్ వర్మ ఇటీవలే తాను దర్శకత్వం వహించిన  “కరోనా” అనే ఈ చిత్రానికి సంబంధించిన విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా కరోనా వైరస్ పరిస్థితులను లెక్కచేయకుండా ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేశామని తెలిపాడు. అంతేకాక తను ఇప్పటి వరకు కూడా ఇలాంటి మాస్క్ ని ధరించ లేదని అంతేగాక శానిటైజర్లను కూడా ఉపయోగించలేదని చెప్పుకొచ్చాడు.

  అనంతరం సినిమా హీరోలు థియేటర్లకు వెళ్లి ప్రచారం చేసినంత మాత్రాన జనాలు తమ చిత్రాలను చూడరని కేవలం ప్రేక్షకులకి ఈ వారంలో విడుదలైనటువంటి చిత్రం ఏదైతే బాగుందో దానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరో వైపు యాంకర్ ని నీ అందానికి ఫిదా అయ్యానని యాంకర్ తో కొంటెగా సమాధానాలు చెబుతూ తనలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ ని బయట పెట్టాడు.

Telugu Corona, Netizens Troll, Netizenstroll, Ram Gopal Varma, Tollywood, Youtub

అంతేగాక తాను ఇప్పటి వరకు తన తల్లిదండ్రులు గురు తదితర ఇలా మాటలు వినలేదు కాబట్టే ఇంత సాధించానని కుండ బద్దలు కొట్టేశాడు.ఇక ఈ కరోనా సినిమాని డిసెంబర్ 12వ తారీఖున థియేటర్లలో విడుదల చేస్తున్నారని తెలిపాడు. అయితే ఈ ఇంటర్వ్యూ చేసినటువంటి కొందరు రామ్ గోపాల్ వర్మ కి యాంకర్లతో పులిహోర కలపడం బాగా అలవాటైందని అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం పరోక్షంగా రామ్ గోపాల్ వర్మ కి లేడీస్ వీక్నెస్ కొంచెం ఎక్కువేనని అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube