తెలుగు ప్రేక్షకులు ఈ పైత్యాన్ని భరించాలా.. టైటిల్స్ అలా ఉన్నాయంటూ?

టాలీవుడ్ ప్రేక్షకులు పాజిటివ్ టాక్ వస్తే ఇతర భాషల సినిమాలను ఆదరించే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.పదుల సంఖ్యలో తమిళ సినిమాలు తెలుగులో కూడా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

 Netizens Negative Comments About Dubbing Movies Titles Details, Dubbing Movies Titles, Kaduva, Sudal, Vaalimai, Ajith, Pruthviraj, Web Series, Rajamouli, Sukumar, Lokesh Kanaka Raj, Movie Titles,-TeluguStop.com

ఓటీటీల ఎంట్రీతో ఇతర భాషల సినిమాలు, వెబ్ సిరీస్ లు తెలుగులో కూడా అందుబాటులోకి వస్తున్నాయి.కొన్ని సినిమాలు ఇతర భాషల నుంచి పరభాషా టైటిల్స్ తోనే ఇక్కడ థియేటర్లలో విడుదలవుతున్నాయి.

కొన్ని నెలల క్రితం అజిత్ హీరోగా తెరకెక్కిన వలిమై సినిమా తెలుగులో కూడా విడుదలైన సంగతి తెలిసిందే.వలిమై అంటే తెలుగులో బలం అని అర్థం.అయితే వలిమై టైటిల్ తోనే ఈ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకులలో చాలామందికి ఈ టైటిల్ నచ్చలేదు.ప్రస్తుతం మలయాళం నుంచి పృథ్వీరాజ్ నటించిన కడువా అనే సినిమా తెలుగులో రిలీజ్ కానుండగా తెలుగులో కూడా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేయడంపై నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Netizens Negative Comments About Dubbing Movies Titles Details, Dubbing Movies Titles, Kaduva, Sudal, Vaalimai, Ajith, Pruthviraj, Web Series, Rajamouli, Sukumar, Lokesh Kanaka Raj, Movie Titles, -తెలుగు ప్రేక్షకులు ఈ పైత్యాన్ని భరించాలా.. టైటిల్స్ అలా ఉన్నాయంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డబ్బింగ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే టైటిల్స్ ను ఫిక్స్ చేస్తే సినిమాల కలెక్షన్లు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

తాజాగా సుడల్ పేరుతో ఒక వెబ్ సిరీస్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.ఈ టైటిల్ ఏంటో అర్థం కాక పాజిటివ్ రివ్యూలు వచ్చినా ఈ వెబ్ సిరీస్ కు దూరంగా ఉంటున్న సెలబ్రిటీలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు.ఈ టైటిల్స్ పైత్యాన్ని ఎలా భరించాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇతర భాషల్లో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లను విడుదల చేయాలనుకుంటే అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే టైటిల్స్ తో ముందుకు వెళితే మంచిదని చెప్పవచ్చు.రాజమౌళి, సుకుమార్, లోకేశ్ కనగరాజ్ లాంటి టాప్ డైరెక్టర్లు టైటిల్స్ విషయంలో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.ఇతర డైరెక్టర్లు కూడా ఈ దిశగా అడుగులు వేస్తే మంచిదని చెప్పవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube