బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు.. కారణాలివే?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.తెలుగులో సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ నాలుగు సీజన్స్ పూర్తైన సంగతి తెలిసిందే.

 Netizens Negative Comments About Bigg Boss Show Why Because, Bigg Boss Show, Int-TeluguStop.com

ప్రస్తుతం ఐదో సీజన్ ప్రసారమవుతుండగా కొంతమంది ప్రముఖులతో పాటు నెటిజన్లు సైతం బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని చెబుతున్నారు.బిగ్ బాస్ షో వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

బిగ్ బాస్ షోలో ఎక్కువగా గొడవలు, అరుపులు, ఏడుపులు మాత్రమే ఉండటంతో పాటు సమాజానికి ఈ షో వల్ల నష్టమే కానీ లాభం లేదని కొంతమంది భావిస్తున్నారు.గతంలో కొంతమంది ఈ షోను ఆపాలని కామెంట్లు కూడా చేసిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ షోలో కొట్లాటలు, తిట్లు అనైతికంగా కనిపిస్తున్నాయని మరి కొందరు వెల్లడిస్తున్నారు.ఈ షో వల్ల సంస్కృతి సంప్రదాయాలు మంటగలుస్తున్నాయన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

ఈ షోకు హోస్టులుగా వ్యవహరిస్తున్న వాళ్లపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Bigg Boss, Bigg Boss Show, Contestant Ovia, Netizens-Movie

మనుషుల మనోభావాలను దెబ్బ తీసే షోగా ఈ షో ఉందని కొందరు భావిస్తున్నారు.ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో కొంతమంది కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు.బిగ్ బాస్ నిర్వాహకులు వాళ్ల రేటింగ్స్ కొరకు కంటెస్టెంట్లు చనిపోయినా పరవాలేదనే విధంగా వ్యవహరిస్తారని ఒవియా అనే కంటెస్టెంట్ కామెంట్ చేశారు.

Telugu Bigg Boss, Bigg Boss Show, Contestant Ovia, Netizens-Movie

బిగ్ బాస్ షో వల్ల పాజిటివ్ ఇమేజ్ నెగిటివ్ గా మారిపోయిందని మరికొందరు కంటెస్టెంట్లు అభిప్రాయపడ్డారు.ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లతో పోలిస్తే ఫేమ్ లేని కంటెస్టెంట్లకు బిగ్ బాస్ షో ఉపయోగపడుతుందని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.మరి కొందరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ షోలో తమపై వచ్చిన నెగిటివ్ కామెంట్ల వల్ల డిప్రెషన్ కు గురయ్యామని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube