చనిపోయిన వారి అస్తికలతో ఆభరణాలు.. షాకవుతున్న నెటిజన్లు!

సాధారణంగా వెండి, బంగారంతో ఆభరణాలు తయారు చేస్తుంటారు.ఆభరణాల తయారీకి ప్లాటినం కూడా ఉపయోగిస్తుంటారు.

 Netizens Mourning The Jewels With The Ashes Of The Dead Details, Died, Jeweller-TeluguStop.com

అయితే ప్రస్తుత కాలంలో ఈ ఆభరణాలన్నిటి కంటే ఒక రకమైన ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది.మామూలు ఆభరణాల లాగా కాకుండా వీటిని చనిపోయిన వారి పళ్లు, జుట్టు, గోళ్లు, అస్తికలతో తయారు చేస్తున్నారు.

అయితే ఈ తరహా ఆభరణాల తయారీ గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్ అవుతున్నారు.కానీ ఈ ఆభరణాల కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలు కారణం గురించి తెలుసుకుని ఫిదా అవుతున్నారు.

ఎవరైనా ఆత్మీయులు, కుటుంబ సభ్యులు చనిపోతే వారికి గుర్తుగా ఏదో ఒక వస్తువు మన దగ్గర ఉంచుకోవడం పరిపాటే.కానీ ఇప్పుడు కొందరు ప్రజలు చనిపోయిన వారి అవశేషాలతో ఆభరణాలు తయారు చేయిస్తున్నారు.

వాటిని ధరిస్తూ మరణించినవారు తమతోనే ఉన్నట్లు భావిస్తున్నారు.మరణించిన వారి జుట్టును ఉంగరాల్లో భద్ర పరచి వారి ఆత్మ తమతోనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు.

అయితే దీనిని వ్యతిరేకించే వారు లేకపోలేదు.కానీ లవ్ అండ్ లాస్ అనే ఈ కాన్సెప్ట్ చాలా మంది ప్రజలకు బాగా నచ్చుతోంది.

అందుకే ఇది బాగా క్రేజ్ తెచ్చుకుంటోంది.న్యూయార్క్‌లోని మార్గరెట్ క్రాస్ అనే సంస్థ రింగ్, బ్రాస్‌లెట్, చైన్ ఇలా చనిపోయిన వారి అవశేషాలతో నగలు తయారు చేస్తోంది.

ఈ ఆభరణాలలో ఎక్కువగా జుట్టు, పళ్లు, గోళ్లు, వినియోగిస్తున్నారు.

Telugu Corpse, Jewellery, Jewels Ashes, Latest, Loved, York-Latest News - Telugu

ఈ ప్రత్యేకమైన ఆభరణాల ధర చాలా ఎక్కువ.ఒక మనిషి అవశేషాలను ఆభరణాలుగా తీర్చిదిద్దేందుకు శ్రమతోపాటు చాలా టైం పడుతుందని, అందుకే అత్యధిక ధరలు వసూలు చేస్తున్నట్లు సంస్థలు చెబుతున్నాయి.అయినా కూడా కొందరు మాత్రం వెనకడుగు వేయకుండా ఈ తరహా ఆభరణాలు చేయిస్తున్నారు.

వీటిని ఇతరులకు అమ్ముకోలేమని, అలాగే ఇతరుల నుంచి కొనలేమని.ఇవి చాలా అమూల్యమైనవని భావిస్తున్నారు.

ప్రేమ అనుబంధాలకు గుర్తుగా నిలిచే ఈ ఆభరణాలకు విలువ కట్టలేమని అంటున్నారు.అయితే ఈ ఆభరణాల వల్ల రోగాలు వచ్చే ప్రమాదం ఉందని.

అలాగే ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగదని మరికొంతమంది వాదనలు వినిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube