ఐకమత్యమే మహాబలం అని చాటిన చీమలు!  

Netizens Marvel At Unity Of Ants-unity Of Ants

చిన్నప్పుడు పిల్లలకు అర్ధమవ్వడానికి పెద్ద వాళ్లు ఎన్నెన్నో కధలు చెప్పేవారు.ఐకమత్యమే మహాబలం అని ఇలా పలు విషయాలు పిల్లలకు నేర్పుతూ ఉంటారు.అయితే ఈ తరం యువత లో ఐకమత్యం అన్న విషయం గురించి ఎంతవరకు తెలుసో తెలియదు కానీ చీమల్లో మాత్రం ఈ యూనిటీ బాగా ఉంది అన్న విషయం ఈ వీడియో ద్వారా అర్ధం అవుతుంది.మామూలుగానే అవి యూనిటీ గా ఉంటూ ప్రతి పనిని చేసుకుంటూ ఉంటాయన్నా విషయం తెలిసిందే.

Netizens Marvel At Unity Of Ants-unity Of Ants-Netizens Marvel At Unity Of Ants-Unity Ants

వాటికి కష్ట జీవులు అనే పేరుంది కూడా.అయితే తాజాగా మరోసారి చీమలు తమ పనితనాన్ని నిరూపించాయి.ప్రస్తుతం ఈ చీమలకు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చీమలు తమ పనితనం తో అద్భుతాన్ని సృష్టించాయి.మహిళా రక్షణ కోసం అహరహం శ్రమిస్తున్న ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతీ లక్రా… ఓ వీడియో షేర్ చేశారు.అది ఇప్పుడు వైరల్ అయిపోయింది.14 సెకండ్ల ఆ వీడియోలో… కొన్ని చీమలు కలిసి… ఓ వంతెనను నిర్మించాయి.

Netizens Marvel At Unity Of Ants-unity Of Ants-Netizens Marvel At Unity Of Ants-Unity Ants

చివరికి వంతెనగా ఆ చీమలు మారిపోవడం గమనార్హం.దీనితో ఇతర చీమలు ఆ చీమలపై నుంచీ దాటుకుంటూ వెళ్తున్నాయి.సోషల్ మీడియాలో ఇప్పటికీ వీడియోని చాలా మంది షేర్ చేస్తున్నారు.ఆ చీమల పనితనం చూసిన ప్రతి ఒక్క నెటిజన్ తెగ మెచ్చుకుంటున్నారు.