యాంకర్ శ్యామలకు చేదు అనుభవం.. పెళ్లి చేసుకోమంటూ..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నెటిజన్లు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు.సోషల్ మీడియా లైవ్ చాట్ లో యాంకర్లకు, సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నారు.

 Netizens Marriage Proposal To Tv Anchor Syamala-TeluguStop.com

ఇష్టానుసారం మెసేజ్ లు చేస్తూ సోషల్ మీడియా వేదికగా హర్ట్ అయ్యేలా చేస్తున్నారు.తెలుగులో యాంకర్ గా గుర్తింపును సంపాదించుకున్న శ్యామలకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది.

బుల్లితెరపై పలు సీరియళ్లలో నటించిన శ్యామల కొన్ని టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించారు.

 Netizens Marriage Proposal To Tv Anchor Syamala-యాంకర్ శ్యామలకు చేదు అనుభవం.. పెళ్లి చేసుకోమంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించి ఆ పాత్రలతో కూడా శ్యామల మెప్పించారు.

బుల్లితెర నటులలో ఒకరైన నరసింహను శ్యామల వివాహం చేసుకోగా ఈ జంటకు ఒక కొడుకు ఉన్నాడు.బిగ్ బాస్ సీజన్ 2లో శ్యామల కంటెస్టెంట్ గా పాల్గొనగా ఆ షో ద్వారా శ్యామలకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది.

ఎన్నికల్లో శ్యామల పోటీ చేయకపోయినా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి 2019 ఎన్నికలకు ముందు ఈమె మద్దతు ప్రకటించారు.

Telugu Anchor Syamala Pregnant, Bigg Boss Season 2 Contestant, Marriage Proposal, Netizen, Question And Answer Session, Social Media, Tv Anchor Syamala, Tv Programs, Ycp Support-Movie

తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా శ్యామల క్స్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించగా ఒక నెటిజన్ శ్యామలకు ఐలవ్యూ చెప్పడంతో పాటు తనను పెళ్లి చేసుకోమని కోరాడు.నెటిజన్ అలా అడగడంతో శ్యామల విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ తో ఉన్న జిఫ్ ఫైల్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.మరొక నెటిజన్ మీరు ఇప్పుడు గర్భవతిగా ఉన్నారా,.? అని ప్రశ్నించగా ఆమె కాదనే సమాధానం ఇచ్చారు.

మరి కొందరు నెటిజన్లు శ్యామల అహారపు అలవాట్ల గురించి, కట్టుకునే చీరల గురించి ప్రశ్నలు సంధించారు.

కొందరు నెటిజన్లు చిరాకు తెప్పించినా యాంకర్ శ్యామల మాత్రం నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు ఇవ్వడం గమనార్హం.గతంతో పోలిస్తే శ్యామలకు ప్రస్తుతం సినిమా, టీవీ ఆఫర్లు తగ్గాయి.

#BiggBoss #YCP Support #Netizen #QuestionAnd #Tv Programs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు