చిన్న పిల్లల ముందు పొట్టి డ్రెస్సులా.. యాంకర్ లపై నెటిజన్లు సీరియస్?

ప్రస్తుతం బుల్లితెరపై ఎప్పుడూ సరికొత్త కార్యక్రమాలు పుట్టుకొస్తున్నాయి.వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమవుతున్నాయి.

 Netizens Firing On Anasuya Srimukhi Dressing Style In Kids Shows Details, Netize-TeluguStop.com

మరీ ముఖ్యంగా ఏ ఛానల్ చూసినా పాటల పోటీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.అయితే జీ తెలుగు లో ప్రసారమయ్యే సరిగమప షో ఈ మధ్య కాలంలో బాగా క్లిక్ అయింది.

దీంతో ఇప్పుడు స్టార్ మా వాళ్లు కూడా చిన్నపిల్లలతో సూపర్ సింగర్ జూనియర్ అంటూ ఒక పాటల కార్యక్రమం మొదలు పెట్టారు.ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్ సుధీర్ యాంకర్ అనసూయ హోస్టింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

అయితే అనసూయ నిన్న జరిగిన షో లో ఎంతో నిండైన దుస్తులు ధరించి ఎంతో పద్ధతిగా కనిపించింది.దీంతో పాటలు కార్యక్రమానికి అనసూయ మంచి డ్రెస్ వేసుకు వచ్చింది అందరూ ప్రశంసలు కురిపించారు.

కానీ గత వారం మాత్రం స్లీవ్ లెస్ డ్రెస్సులో అనసూయను చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు అని చెప్పాలి.ఇక జీ తెలుగులో యాంకర్ శ్రీముఖి కూడా కాస్త పొట్టి డ్రెస్సులు వేస్తూ కెమెరాల దృష్టి తనపైనే ఉండేలా చూసుకుంటుంది.

ఇక నిన్న జరిగిన షో లో శ్రీముఖి వేసుకున్న డ్రెస్ పై కాస్త నెగిటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయండోయ్.పాటల పోటీల్లో మరి ఇలాంటి డ్రెస్సులు అవసరమా అంటూ కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు.

Telugu Anasuya, Anchor Dresses, Shows, Netizens, Saregamapa Show, Srimukhi, Telu

అటు బూతు అంటూ పేరున్న జబర్దస్త్ లోనే యాంకర్లు ఇలాంటి డ్రెస్సులు వేయడం లేదు.మరి పద్ధతిగా ఉండే పాటల కార్యక్రమం లో శ్రీముఖి ఇలాంటి డ్రెస్సులు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.ఎందుకంటే పద్ధతిగా సాగే పాటల ఈ కార్యక్రమానికి ఇలాంటి పొట్టి డ్రెస్సులు గోల ఏంటో అర్థం కావడం లేదని మరికొంత మంది పెదవి విరుస్తున్నారు నెటిజన్లు.ఇక రానున్న రోజుల్లో ఒకవైపు అనసూయ మరోవైపు శ్రీముఖి డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండబోతోంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube