మొన్న వివిఆర్ ఈవెంట్ లో అలా అన్నందుకు త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్న ఇతర హీరో ఫాన్స్.! మీ కామెంట్ ఏంటి?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తాజాగా న‌టిస్తున్న మూవీ విన‌య విధేయ రామ‌.ఈ మూవీకి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కుడు కాగా, కైరా అద్వాని హీరోయిన్.

 Netizens Fires On Trivikram Srinivas His Speech In Vvr Event-TeluguStop.com

ఇక ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక మొన్న హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో టి ఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కె టీ ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సినిమా ట్రైలర్ ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ విడుదల చేశారు.

ఈ ఈవెంట్ కి మెయిన్ హైలైట్ త్రివిక్రమ్ గారు.

త్రివిక్రమ్ గారి స్పీచ్ ఎంతమంది ఫాన్స్ ఉన్నారో కొత్తగా చెప్పనవసరంలేదు.యూట్యూబ్ లో ఆయన స్పీచ్ వీడియోకి ఉండే వ్యూస్ ఏ సాక్షం.ఈవెంట్ లో అందరి స్పీచులు ఒక ఎత్తయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు కోటలు దాటాయి.

చరణ్ సింహం లాంటి వాడని అన్నాడు.సింహం మిగతా జంతువుల మాదిరిగా రోజూ వేటాడదని.

బాగా ఆకలేసినప్పుడు మాత్రం అడవిలోకి వెళ్తుందన్నాడు.కానీ అలా వెళ్ళిన రోజు మాత్రం వేట సాలిడ్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఈ ఉపమానాలు ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్లను ఉద్దేశించి అన్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అంతటితో ఆగకుండా సింహం వేటాడి తినగా వదిలేస్తే మిగిలిన దాంతో చాలారోజుల పాటూ నక్కలు.హైనాలు పండగ చేసుకుంటాయని అన్నాడు త్రివిక్రమ్.అంతా నిజమే.

సింహం గురించి కాస్త ఇన్ ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకు తెలిసిందే.త్రివిక్రమ్ చరణ్ ను సింహం తో పోల్చాడు.

పొగిడాడు సరిపోయింది.కానీ త్రివిక్రమ్ చెప్పిన నక్కలు.

హైనాలు ఎవరని.ఆ మిగిలిన దాన్ని తినేవాళ్ళు ఎవరని ఇప్పుడు నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.

చరణ్ సింహం అయితే.మిగతా హీరోలు మిగిలిన దాన్ని తినే నక్కలు.హైనాలని అనుకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.అంతేకాదు చరణ్ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ లు ఏం కాలేదు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.మొత్తానికి ఆడియో లాంచ్ లో హీరోలను పొగడలికాని ఇలా మరీ లిమిట్ ను దాటి పొగిడేస్తే కష్టమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube