అనసూయను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమిదే..?

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా, వెండితెరపై గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రల్లో నటిస్తూ వరుస అవకాశాలతో యాంకర్ అనసూయ బిజీగా ఉన్నారు.చాలా సంవత్సరాల క్రితం నుంచే సినిమా, టీవీ రంగాల్లో ఉన్నా జబర్దస్త్ షో ద్వారానే అనసూయకు గుర్తింపు వచ్చింది.

 Netizens Fires On Anchor Anasuya Short Dress, Anchor Anasuya, Jabardast Show, Ne-TeluguStop.com

అయితే చాలా సందర్భాల్లో అనసూయ వస్త్రధారణను నెటిజన్లు ట్రోల్ చేయగా మరోసారి అనసూయ వస్త్రధారణ వల్ల ట్రోల్ అవుతున్నారు.జబర్దస్త్ షో కోసం ట్రెండీగా రెడీ అయిన అనసూయపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.అందం, అభినయం పుష్కలంగా ఉన్న అనసూయ ఫోటో షూట్లు, షోలలో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు.

అయితే అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు మాత్రం నెటిజన్లు అనసూయపై ఫైర్ అవుతున్నారు.తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అనసూయ జబర్దస్త్ షో కోసం దిగిన టాప్ మాత్రమే ఉన్న గ్రీన్ డ్రెస్ ఫోటోను షేర్ చేశారు.

Telugu Anchor Anasuya, Jabardasth Show, Netizens, Short-Movie

దీంతో కొందరు నెటిజన్లు “ప్యాంట్ మరిచిపోయారా“, ” అలాంటి డ్రెస్సులు వేసుకుంటే నిన్ను చూసి అమ్మాయిలు నీలాగే తయారవుతారు” అని దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.అయితే కొందరు అభిమానులు మాత్రం ట్రోలింగ్ ను పట్టించుకోవద్దని విమర్శించేవాళ్లు ఎప్పుడూ ఏదో ఒక విధంగా విమర్శిస్తూనే ఉంటారని అనసూయకు సూచిస్తున్నారు.గతంలో తనను ట్రోల్ చేసిన వారికి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.

గతంలో అనసూయను వస్త్రధారణ విషయంలో ట్రోల్ చేయగా తన బట్టల గురించి మాట్లాడటం మాని ఆలోచించే విధానం మార్చుకోవాలని నెటిజన్లకు అనసూయ సూచించారు.

తను వేసుకునే డ్రెస్సుల విషయంలో భర్త, పిల్లలకు ఎటువంటి అభ్యంతరాలు లేవని మీకెందుకు అభ్యంతరం అంటూ నెటిజన్లకు ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు.మరోసారి డ్రెస్సింగ్ విషయంలో ట్రోల్స్ వస్తూ ఉండటంతో అనసూయ ఆ ట్రోల్స్ కు కౌంటర్లు ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube