థమన్‌పై మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ హ్యాట్రిక్ విజయం అందుకుంది.

 Netizens Fire On Thaman Comments On Trivikram-TeluguStop.com

ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన థమన్, తన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా పలు సెన్సేషనల్ రికార్డులు కూడా క్రియేట్ చేశాడు.

ఈ సినిమాలోని పాటలు ఎంత ఘనవిజయం అందుకున్నాయో అందరికీ తెలిసిందే.

కాగా తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్‌లో థమన్ దర్శకుడు త్రివిక్రమ్‌ను ఓ రేంజ్‌లో పొగిడేశాడు.ఈ సినిమా కోసం తాను చాలాకాలంగా కష్టపడ్డాడని, తన కష్టానికి మంచి ప్రతిఫలం లభించిందని చెప్పుకొచ్చాడు.

ఇక తాను ఇప్పటివరకు చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ చాలా కూల్‌గా ఉంటాడని, ఆయన లాంటి వ్యక్తిని తాను చూడలేదంటూ త్రివిక్రమ్ భజన చేశాడు థమన్.దీంతో నెటిజన్లు థమన్‌పై ఫైర్ అవుతున్నారు.

ఇప్పటివరకు తాను చేసిన డైరెక్టర్స్‌ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని, తనకు అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్స్‌ను థమన్ అవమానించడం సరికాదంటూ వారు మండిపడుతున్నారు.ఏదేమైనా త్రివిక్రమ్‌ను పొగిడే క్రమంలో థమన్ పప్పులో కాలేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube