ఆ హీరోయిన్ సినిమాని చూడొద్దంటున్న నెటిజన్లు....

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ బాలీవుడ్ లో “థప్పడ్” అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అబుంభవ్ సిన్హా దర్శకత్వం వహించాడు.

 Netizens Fire On Taapsee Thappad Movie-TeluguStop.com

అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు సిన్హా నిర్మాతగా కూడా వ్యవహరించారు.ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

అయితే గత కొద్ది కాలంగా దేశంలో సిసిఎ వ్యతిరేక నిరసనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే ఈ విషయంపై అప్పట్లో హీరోయిన్ తాప్సీ సిసిఎ వ్యతిరేక దారుల తన మద్దతు తెలిపింది.

దీంతో ఈ విషయం నచ్చని కొందరు వ్యక్తులు ఇప్పుడు తాప్సీ సినిమాను చూడొద్దంటూ బాయ్ కాట్ చేయాలంటూ ట్విట్టర్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు.అంతేగాక ఇందుకుగాను “బాయ్ కాట్ థప్పడ్”  అనే హాష్ ట్రెండింగ్  చేస్తున్నారు.

ఈ విషయంపై తాజాగా తాప్సి స్పందించింది.ఇందులో భాగంగా ఎవరో చెబితే తమ అభిమాన నటీనటులను సినిమాలను సినీ అభిమానులు చూడకుండా ఉండరని వాళ్లకి చూడాలనిపిస్తే చూస్తారని లేకపోతే మానేస్తారని అన్నారు.

అంతే తప్ప సినిమా చూసే వాళ్ళని ఎవరు ఆపలేరని తెలిపారు.

Telugu Thappad, Thappad Latest, Thappad Review, Thappad Tapsee-Movie

అయితే ఒక చిన్న చెంపదెబ్బ కొట్టినందుకు వివాహిత కోర్టు మెట్లు ఎక్కి విడాకులు కావాలి అని అడిగే మహిళ పాత్రలో తాప్సీ నటించింది.అయితే ఈ చిత్రం ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో పర్వాలేదనిపిస్తుంది.అటు వసూళ్ళ పరంగా కూడా వారాంతంలో సినిమాలు లేకపోవడంతో బాగానే రాబడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube