హీరోయిన్ ని సపోర్ట్ చేసినందుకు తెలుగు యాంకర్ ని ఆడుకుంటున్నారుగా...

తెలుగు లో ప్రసారమయ్యేటువంటి “డీ” జోడి మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటాలీవుడ్ హాట్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి అందరికీ బాగానే తెలుసు.అయితే ఈ అమ్మడు ఒకపక్క అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే మరో పక్క ఈవెంట్లు, షోలు అంటూ బిజీబిజీగా గడుపుతోంది.

 Netizens Fire On Rashmi Gautam For The Supporting To The Tapsee-TeluguStop.com

అయితే తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్ హీరోయిన్ తాప్సి నటించిన  ఓ చిత్రంపై స్పందించినందుకు గాను నెటిజన్లు యాంకర్ రష్మి గౌతమ్ పై మండిపడుతున్నారు.

డోరా లోకి వెళితే ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోయిన్  గ్లామర్ క్వీన్ తాప్సి పన్ను “థప్పడ్”  అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించాడు.అయితే ఈ చిత్రాన్ని చూసినటువంటి రష్మి గౌతమ్ ఈ చిత్రం చాలా బాగుందని కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం అని అంతేకాక మీరు కూడా వెళ్లి చూడాలని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.

దీంతో కొంత మంది నెటిజన్లు రష్మీ చేసినటువంటి ఈ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే అప్పట్లో హీరోయిన్ తాప్సీ సిఏఏ వ్యతిరేక నిరసనలకు మద్దతు తెలిపినందుకు గానూ ఆమెపై రగిలిపోతున్నటువంటి కొందరు నిరసనకారులు ఆమె చిత్రాన్ని చూడొద్దంటూ “బాయ్ కాట్ థప్పడ్” అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ చేస్తున్నారు.

Telugu Rashmi Gautam, Rashmigautam, Tapsee-Movie

అయితే ఈ విషయంపై స్పందించిన అటువంటి రష్మి గౌతమ్ కూడా వేరే ఇతర సమస్యలతో చిత్రాన్ని ముడి పెట్టకూడదని నచ్చిన వాళ్ళు చూడండి లేకపోతే లేదంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.అంతేగాక తనపై మండిపడుతున్న టువంటి నెటిజన్లు కనీసం ఈ చిత్రాన్ని చూశారా లేక చిత్ర ట్రైలర్ ను చూసి మాత్రమే అంచనాకు వచ్చారా అంటూ మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube