నెటిజన్స్ కు కోపం తెప్పించిన పూజా హెగ్డే.. అలాంటి యాడ్ లో నటించడంతో?

Netizens Fire On Pooja Hegde Regarding Commercial Ad

తెలుగు తెరపై ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ల జాబితాను పరిశీలిస్తే ఆ జాబితాలో ముందువరసలో ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరని చెప్పాలి.ఫ్లాపుల్లో ఉన్న హీరోలు తమ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తే సక్సెస్ దక్కుతుందని అనుకుంటున్నారు.

 Netizens Fire On Pooja Hegde Regarding Commercial Ad-TeluguStop.com

వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే స్టార్ హీరోల కొత్త సినిమాలకు డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉండటం గమనార్హం.

అయితే ఈ బ్యూటీ యాడ్స్ ద్వారా కూడా పాపులారిటీని పెంచుకుంటున్నారు.

 Netizens Fire On Pooja Hegde Regarding Commercial Ad-నెటిజన్స్ కు కోపం తెప్పించిన పూజా హెగ్డే.. అలాంటి యాడ్ లో నటించడంతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఈ బ్యూటీ ఒక కమర్షియల్ యాడ్ లో మెరవగా ఆ యాడ్ విషయంలో నెటిజన్లు పూజా హెగ్డేపై ఫైర్ అవుతున్నారు.ఆల్కహాల్ బ్రాండ్ ను పూజా హెగ్డే ప్రమోట్ చేస్తున్నట్టు విడుదలైన యాడ్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

యాడ్ లో ఒక మద్యం కంపెనీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందనే కారణంతో విదేశీ ప్రయాణానికి టికెట్లు గెలుచుకోవాలని సూచించింది.

అందులో పూజా హెగ్డే పొట్టి గౌనును ధరించి విస్కీని గ్లాస్ లో పోసుకుని అందులో ఐస్ ముక్కలు వేసుకున్నారు.

Telugu Ad, Kajal Agarwal, Netizens, Pooja Hegde, Pooja Hegde Ad, Prabhas, Radhe Shyam, Tollywood-Movie

పూజా హెగ్డే తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ యాడ్ ను షేర్ చేశారు.అయితే డబ్బు కోసం పూజా హెగ్డే ఇలాంటి యాడ్స్ లో నటించడం కరెక్ట్ కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.డబ్బుల కోసం మద్యం సేవించాలని అభిమానులకు సూచించడం కరెక్ట్ కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Telugu Ad, Kajal Agarwal, Netizens, Pooja Hegde, Pooja Hegde Ad, Prabhas, Radhe Shyam, Tollywood-Movie

కాజల్ అగర్వాల్ తో పాటు పలువురు హీరోయిన్లు ఈ యాడ్స్ లో నటించి విమర్శలను ఎదుర్కొన్నారు.నెటిజన్ల ట్రోల్స్ గురించి పూజా హెగ్డే స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.వచ్చే ఏడాది జనవరిలో ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుంది.

#Ad #Radhe Shyam #Pooja Hegde #Netizens #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube