తండ్రి విష‌యంలో నోయ‌ల్ అబద్ధాలు.. ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు?

తెలుగు అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్‌.ప్ర‌స్తుతం ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టింది.

 Netizens Fire On Noel In Bigg Boss 4! Netizens, Noel, Bigg Boss 4, Noel Father,-TeluguStop.com

వాస్త‌వానికి కంటెస్టెంట్ల‌లో చాలా మంది ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని వారే ఉండ‌డంతో.మొద‌ట షోపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

కానీ, ఆ త‌ర్వాత బిగ్ బాస్ కాస్త మ‌సాలా ద‌ట్టించ‌డంతో.అనూహ్యంగా షో పుంజుకుంది.

ఇదిలా ఉంటే.ఈ సీజ‌న్‌లో కాస్త బాగా తెలిసిన వారిలో నోయ‌ల్ ఒక‌డు.

గ‌త ప‌దేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉంటున్న నోయ‌ల్ సింగ‌ర్‌గానే కాకుండా.న‌టుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నా‌డు.అయితే ఇటీవ‌ల బిగ్ బాస్ హౌస్‌లో త‌న తండ్రి గురించి నోయ‌ల్ అబ‌ద్ధాలు చెప్ప‌డంతో.ప్ర‌స్తుతం నెటిజ‌న్లు ఏకిపారేస్తున్నారు.

విష‌యం ఏంటంటే.ఆరో వారంలో ఇంటి స‌భ్యులంద‌రూ త‌మ లైఫ్‌లో జ‌రిగిన విష‌యాల‌ను షేర్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే నోయ‌ల్ త‌న కుటుంబం గురించి చెప్తూ.మా అమ్మ అంద‌రి ఇళ్ల‌ల్లో ప‌ని చేసేది.

నాన్న ఇస్త్రీ, మేస్త్రీ ప‌ని చేస్తూ డ‌బ్బులు సంపాదించేవాడు అని చెప్పుకొచ్చాడు.కానీ, వికీపీడియాలో మాత్రం నోయ‌ల్‌ తండ్రి రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి అని ఉంది.ఇది చూసిన నెటిజ‌న్లు నోయ‌ల్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.కేవ‌లం ప్రేక్ష‌కుల్లో సింప‌‌థీ సంపాదించుకునేందుకే నోయ‌ల్ త‌న కుటుంబం గురించి అబద్ధాలు చెప్పాడని మండిప‌డుతున్నాడు.

తండ్రి డిఫెన్స్ ఉద్యోగి అయినా కూడా రోజువారీ కూలీ అని చెప్ప‌డం క‌రెక్ట్ కాద‌ని అంటున్నారు.మ‌రోవైపు నోయ‌ల్‌ను స‌పోర్ట్ చేస్తున్న వారు లేక‌పోలేదు.మొత్తానికి నోయ‌ల్ అడ్డంగా బుక్క‌య్యాడ‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.కాగా, ఈగ, నాన్నకు ప్రేమతో, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, కుమారి 21ఎఫ్ వంటి చిత్రాల్లో న‌టించిన నోయ‌ల్‌.

ప్ర‌స్తుతం ది షేక్ గ్రూప్ పేరుతో ఓ తెలుగు బ్యాండ్‌ను నిర్వ‌హిస్తున్నారు.ఇక 2019లో ఎస్త‌ర్ నోరోన్హాను ప్రేమ వివాహం చేసుకున్న నోయ‌ల్ కొద్ది రోజుల క్రిత‌మే డివోర్స్ తీసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube