Ananya Nagalla : శ్రీరామనవమి శుభాకాంక్షలంటూ అలాంటి వీడియోని షేర్ చేసిన అనన్య నాగళ్ళ.. ఫైరవుతున్న నెటిజన్స్?

మామూలుగా పండుగ సందర్భాలలో సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియాలలో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు.అయితే ఈరోజు శ్రీరామనవమి ( Sri Rama Navami )సందర్భంగా ఈరోజు కూడా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

 Netizens Fire On Ananya Nagalla About Her Exposing Video-TeluguStop.com

ఇక సెలబ్రిటీలు ట్రెడిషనల్ గా రెడీ అయ్యి శ్రీరాముల వారితో దిగిన ఫోటోలను, వీడియోలను పంచుకున్నారు.

కానీ కొంతమంది సెలబ్రిటీలు పండగ శుభాకాంక్షలు తెలిపేటప్పుడు కూడా కాస్త షో చేస్తూ ఉంటారు.

నిజానికి వాళ్ళు చెప్పే శుభాకాంక్షలకు, వాళ్ళు పెట్టే ఫోటోలకు అస్సలు సంబంధమే ఉండదు.అందుకే వీరిని బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా అనన్య నాగళ్ళ ( Ananya Nagalla )కూడా శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది కానీ పెట్టిన వీడియోని చూసి ప్రతి ఒక్కరు ఫైర్ అవుతున్నారు.ఇంతకు ఆమె ఎటువంటి వీడియో పెట్టిందో ఒకసారి తెలుసుకుందాం.

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలంగాణకు చెందిన ఈమె మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో చేసి ఆ తర్వాత వెండితెరపై అవకాశం అందుకుంది.

అలా తొలిసారిగా మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఇక ఈ సినిమా తర్వాత చాలా రోజులకు వకీల్ సాబ్ ( Vakil Saab )సినిమాలో అవకాశం అందుకుంది.

ఆ తర్వాత పలు చిన్న చిన్న సినిమాలలో కూడా చేసింది.కానీ ఇప్పుడు అంతగా అవకాశాలు మాత్రం రావట్లేదు.ఈ బ్యూటీకి నటన పరంగా కాకుండా అందం పరంగా మంచి అభిమానం ఉంది.తన అందాలతో తెలుగు కుర్రాళ్లను ఫిదా చేసింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇప్పుడు అవకాశాలు తక్కువగా ఉండటంతో అవకాశాలు ఎక్కువగా రావడం కోసం గ్లామర్ షో చేయడం కూడా మొదలుపెట్టింది.

కెరీర్ మొదట్లో చాలా పద్ధతిగా కనిపించిన అనన్య ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.అసలు పద్ధతినే మర్చిపోయింది అన్నట్లుగా తయారయింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద నుండి థైస్ వరకు అందాలను లోతుగా బయట పెడుతుంది.ఇక ఆమె ఆ విధంగా గ్లామర్ షో చేయటంతో ప్రతి ఒక్కరు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

అవకాశాలు రావాలంటే నటన పరంగా టాలెంట్ చూపించాలి కాని అందం పరంగా కాదు అంటూ కామెంట్లు కూడా చేశారు.

అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకుంది.ఇక ఆ వీడియోలో తను స్లీవ్ లెస్ బ్లౌజ్ తో చీర కట్టుకొని బాగా షో చేస్తూ కనిపించింది.ఇక ఆ వీడియోకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ పంచుకుంది.

దీంతో నెటిజన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు.నువ్వు షేర్ చేసిన వీడియో ఏంటి పెట్టిన క్యాప్షన్ ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ పోస్ట్ కి శ్రీరామనవమి కి ఏమైనా సంబంధం ఉందా అంటూ బాగా ఏకీపారేస్తున్నారు.ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube