దేత్తడి హారికపై ఫైర్ అవుతున్న నెటిజన్లు... కారణం ఇదే?

బిగ్ బాస్ వీక్షకులకు దేత్తడి హారిక కొత్తేమో కానీ యూట్యూబ్ వీక్షకులకు హారిక ఎప్పటినుంచో సుపరిచితం.యూట్యూబ్ లో లక్షల సంఖ్యలో సబ్ స్క్రైబర్లు దేత్తడి ఛానల్ కు ఉన్నారు.

 Netizens Slam On Dhethadi Harika Birthday Post, Dhethadi Harika, Birthday Post,-TeluguStop.com

హారిక నటించిన కొన్ని వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.చాలామంది నెటిజన్లు హారిక సైతం బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ రేసులో నిలుస్తారని భావిస్తున్నారు.

యూట్యూబ్ స్టార్ అయిన హారికకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది.

అయితే తాజాగా హారిక కుటుంబ సభ్యులు చేసిన ఒక పని వల్ల హారికపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజల్లో ఆమెపై ఉన్న పాజిటివ్ ఒపీనియన్ కాస్తా నెగిటివ్ గా మారుతోంది.ఈ నెల 8వ తేదీన హారిక పుట్టినరోజు.ఈ సంవత్సరం పుట్టిన రోజున బిగ్ బాస్ హౌస్ లో ఉన్న హారిక గతేడాది చిన్నపిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకుని వాళ్లకు హారిక బిస్కెట్లు, పండ్లు పంచిపెట్టింది.

చేసింది మంచి పనే అయినప్పటికీ గతేడాది పుట్టినరోజు సమయంలో హారిక ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోలేదు.

అయితే ఈ సంవత్సరం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులు పోస్ట్ చేయడం నెటిజన్లు దేత్తడి హారిక, ఆమె కుటుంబ సభ్యుల తీరుపై ఫైర్ అవుతున్నారు.ఇది చీప్ పబ్లిసిటీ స్టంట్ అంటూ ఎప్పటి ఫోటోలనో ఇప్పుడు ఎందుకు వదులుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

బిగ్ బాస్ ఓట్ల కోసం స్థాయిని తగ్గించుకునే పనులు చేయవద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు హారిక ఎలిమినేషన్ జోన్ లో లేదని… అందువల్ల ఇలాంటి చీప్ ట్రిక్స్ తో ఓట్లు సంపాదించుకోవాల్సిన అవసరం లేదని కామెంట్లు పెడుతున్నారు.

మరికొందరు నెటిజన్లు తొలి వారంలోనే పబ్లిసిటీ స్టంట్లు మొదలుపెట్టారని….ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ల వల్ల పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా జరుగుతుందని కామెంట్లు పెడుతున్నారు.

ఏదేమైనా దేత్తడి హారికకు నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు మాత్రం తప్పడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube