చిలక తెలివికి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు.ఎందుకంటే ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం అనేవి సాధారణంగా జీవితంలో ఒకసారి మాత్రమే జరుగుతుంటాయి.

 Netizens Delighted Creativity Of Parrot To Build Nest Details, Parrot, Inteligen-TeluguStop.com

వాటిని ఎంతో ఆడంబరంగా నిర్వహించేందుకు, తమ స్తోమత కొద్దీ ఖర్చు పెడుతుంటారు.అయితే మనుషులు సంగతి ఎలా ఉన్నా, పక్షులు కట్టే గూళ్లు ఎంతో అందంగా, చూడముచ్చటగా ఉంటాయి.

ఎక్కడెక్కడి నుంచో పుల్లలు, ఆకులు, పీచు లాంటివి సేకరించి, చక్కటి గూళ్లు కడుతుంటాయి.వాటిని చూడగానే పక్షులు నిర్మాణ శైలిని ఎవరూ ప్రశంసించకుండా ఉండలేరు.

తాజాగా నెట్టింట వైరల్ అయిన ఓ వీడియోలో చిలక తెలివికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సాధారణంగా గూళ్ల నిర్మాణానికి పుల్లలు కావాలి.ఆ వీడియోలో కనిపించిన చిలక మాత్రం పచ్చి ఆకుల వెనుక ఉన్న పుల్లలను సేకరించింది.అది కూడా ఆకుకు ఏమీ కాకుండా కేవలం దాని వెనుక ఉన్న పుల్లలను మాత్రమే తీసింది.ఒక్క పుల్లను తీసి, తన తోక భాగంలో దాచుకుంది.

ఆ తర్వాత మరిన్ని పుల్లలు సేకరిస్తూ వచ్చింది.దాని తెలివికి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

పక్షికి ఇంత తెలివా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఆకుకు ఏ మాత్రం కొంచెం కూడా డ్యామేజీ కాకుండా దాని పుల్లలు తీయడం మనుషులకు కూడా కష్ట సాధ్యం.అలాంటి పనిని ఆ చిలక కేవలం తన ముక్కుతో అవలీలగా ఎన్నో పుల్లలు క్షణాల్లో తీసేస్తుంది.ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

దాని నిర్మాణ శైలిని మెచ్చుకుంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.దాని తెలివి అద్భుతమని కొనియాడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube