పెళ్లి అనేది జీవితాంతం గుర్తుండిపోయే ఓ వేడుక.ఓ మధుర జ్ఞాపకం.
అందుకే అందరినీ పిలిచి ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు.కొందరు వారి వారి స్థోమతను బట్టి ఏర్పాట్లు చేస్తారు.
ఈ సమయంలో వరుడు, వధువు వారి తల్లిదండ్రులతో చాలా ఆనందంగా గడుపుతారు.కానీ ఓ పెళ్లిలో అక్కడికి వచ్చిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇంతకీ అందుకు కారణం ఏమిటో చూద్దాం.పాకిస్థాన్ దేశంలో ఇటీవలే ఓ పెళ్లి జరిగింది.
అందులో పెళ్లి కూతరే కాదు అక్కడికి వచ్చిన వారి బంధువులు సైతం కంటతడి పెట్టుకున్నారు.ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూస్తున్న వారి హృదయాలు సైతం చలించక మానవు.
పెళ్లి మండపం వద్దకు ఒక చేతితో తండ్రి చేతిని పట్టుకుని వస్తున్న వధువు.
మరో చేతిలో తన తల్లి ఫొటోను పట్టుకుంది.ఆ వధువు తల్లి గతంలో చనిపోవడం బాధాకరం.
తన పెళ్లికి తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలని ఆమె ఆశపడింది.అందుకే ఓ చేత్తో తండ్రి చేయిని పట్టుకుని మరో చేతిలో తల్లి ఫొటోను పట్టుకుంది.
ఈ టైంలో తన తల్లిసైతం పక్కనే ఉన్నట్టు ఆమె ఫీల్ అయింది.
తల్లి ఫొటోను చూస్తూ ఎమోషనల్ అయింది.దీంతో వధువు తండ్రి సైతం ఏడ్చేశాడు.వారిద్దరూ ఎడుస్తుండటంతో అక్కడికి వచ్చిన వారి బంధువులు సైతం కన్నీరు పెట్టారు.
అనంతరం వధువును ఆమె అత్తింటివారు ఓదార్చి కన్నీరు తుడిచారు.ఇందుకు సంబంధించిన వీడియోను ఇస్లామాబాద్ కు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆమెను ఓదార్చుతూ కామెంట్స్ చేస్తున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోనూ మీరు ఓ సారి చూడండి.