బాక్సులు బద్దలైపోతాయంటూ వాల్తేరు వీరయ్య పోస్టర్ షేర్ చేసిన రవితేజ.. అంతగా ఏమీ లేదంటూ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ధమాకా హిట్ తో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.చిన్న చిన్న సినిమాల ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ ఆ తర్వాత హీరోగా పరిచయమై ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Netizens Comments On Waltair Veerayya Poster,raviteja,chiranjeevi,waltair Veeray-TeluguStop.com

చాలావరకు మాస్ కంటెంట్ ఉన్న సినిమాలను చేసి మాస్ మహారాజుగా ఎదిగాడు.

ఇక ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.

కేవలం నటుడుగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు.అయితే బెంగాల్ టైగర్ సినిమా తర్వాత రవితేజకు సరైన హిట్టు అనేది లేకపోయింది.

ఆ సమయంలో వచ్చిన వరుస సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.దీంతో మంచి సక్సెస్ కోసం ఎదురు చూడగా క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.

అంతేకాకుండా ఖిలాడి సినిమా, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కూడా మంచి సక్సెస్ ను అందించాయి.ఇక గత ఏడాది ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకోగా ఇప్పటికీ ఆ సినిమా థియేటర్లో సందడి చేస్తుంది.ఇక ప్రస్తుతం ఆయన ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి.ఇక చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా సంక్రాంతి నా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఈ సినిమాతో పాటు టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలో కూడా అవకాశం అందుకున్నాడు రవితేజ.

ఇక ఇదంతా పక్కన పెడితే చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా రవితేజ ఈ సినిమాకు కూడా జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నాడు.

ఇందులో ఒక కీలక పాత్రలో చేయగా ఈ సినిమా గురించి బాగా అనౌన్స్మెంట్ చేస్తున్నాడు.ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అక్కడ కూడా వాల్తేరు వీరయ్య సినిమా గురించి జోరుగా ప్రచారం చేస్తున్నాడు.

అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన పోస్టర్ షేర్ చేసుకొని హలో మాస్టారు.సంక్రాంతికి బాక్సులు బద్దలై పోతాయి అని డైలాగ్ కొట్టి ట్రైలర్ లింకు షేర్ చేసుకున్నాడు.ఇక వెంటనే ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్.మీరు చెప్పినంత ఏమీ లేదు రవితేజ గారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


మరి ఈ సంక్రాంతికి బాలయ్య సినిమాతో పోటీగా వస్తున్న ఈ సినిమా ఎటువంటి టాక్ సొంతం చేసుకుంటుందో తెలియదు కానీ.చాలావరకు బాలయ్య సినిమా ట్రైలర్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

వాల్తేరు వీరయ్యే ట్రైలర్ చూసినప్పటికీ కూడా ప్రేక్షకులు ఆ ట్రైలర్ పట్ల అంతగా ఆసక్తి చూపించినట్లు అనిపించలేదు.ఆచార్యతో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న చిరంజీవికి ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

ప్రస్తుతం ఈ సినీ బృందం జోరు ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube