మరోసారి షాపింగ్ అంటూ శివ జ్యోతి పోస్ట్.. నీ బుద్ధి ఎక్కడికి పోతదంటూ దారుణమైన ట్రోల్స్?

యాంకర్ శివ జ్యోతి కంటే తీన్మార్ సావిత్రి అనే ఈ పేరు అందరికి బాగా పరిచయం.ఎందుకంటే తన మాట తీరుతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 Netizens Comments On Shiva Jyothi Latest Shopping Video Details, Shiva Jyoti, Sh-TeluguStop.com

అలా చాలామంది అభిమానులను సంపాదించుకుంది.తొలిసారిగా వి6 న్యూస్ ఛానల్ లో తీన్మార్ వార్తలతో న్యూస్ యాంకర్ గా పరిచయమైంది.

ఈమె తెలంగాణ, నిజామాబాద్ జిల్లా, నాగంపేట గ్రామానికి చెందినది.

ఈమెకు గంగూలి అనే వ్యక్తితో వివాహం కూడా జరిగింది.

ఇక యాంకర్ గా మంచి గుర్తింపు పొందాలని కొన్ని ఛానల్స్ లో యాంకరింగ్ చేసింది.ఇక ఆ తర్వాత v6 లో తీన్మార్ సావిత్రిలా, బుగ్గల జాకెట్ ధరించుకున్న యాంకర్ గా పేరు సంపాదించుకుంది శివ జ్యోతి.

ఆ తర్వాత బిగ్ బాస్ షో లో అవకాశం రాగా హౌస్ లో ఉన్నంత కాలం తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంది.

బిగ్ బాస్ తర్వాత టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ లో అడుగుపెట్టింది.ఇక బిగ్ బాస్ లో తనతో పాల్గొన్న కంటెస్టెంట్ లతో ఇప్పుడు కూడా అదే ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేస్తుంది.వారితో కలిసి బాగా పార్టీలలో తిరుగుతూ ఉంటుంది.

ఇక ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఉన్న శివ జ్యోతి బిగ్ బాస్ తర్వాత గ్లామర్ ను పరిచయం చేసింది.మోడ్రన్ గా తయారవుతూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.

ముఖ్యంగా తనంటే ఎంతో అభిమానించే ప్రజలే ఆమె వస్త్రధారణ చూసి తట్టుకోలేకపోతున్నారు.అయినా కూడా తన ఇన్ స్టా లో ఎప్పటికప్పుడు గ్లామర్ లుక్ తో ఫోటో షూట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక యూట్యూబ్లో కూడా తన పేరు మీద ఛానల్ క్రియేట్ చేసుకుంది.ఇందులో ఇప్పటికీ చాలా వీడియోలు షేర్ చేసుకుంది.

ఇక తాను షేర్ చేసుకున్న వీడియోలలో ఎక్కువగా షాపింగ్ లకు సంబంధించిన వీడియోలే ఉంటాయి.ఇప్పటికీ తను బంగారం కొన్న వీడియోలను, చీరలు కొన్ని వీడియోలను బాగా షేర్ చేసుకోవడంతో బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంది.నీకు ఎప్పుడు ఇదే పనా అని ఆమెను బాగా కామెంట్స్ ద్వారా ట్రోల్ చేశారు నెటిజన్స్.అయితే తాజాగా మరో వీడియో షేర్ చేసుకుంది శివ జ్యోతి.

అందులో గృహప్రవేశానికి పెట్టువోతుల చీర కొన్నాం అంటూ వీడియో పంచుకుంది.ఇక ఆ వీడియో లింకును తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది.

దీంతో అది చూసిన నెటిజన్స్ మరోసారి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.ఓ నేటిజన్ మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

పది రోజుల నుండి నీ సోది వీడియోలు పెట్టకపోయేసరికి ఏదో మారవులే కంటెంట్ విషయంలో అనుకున్నా.కానీ నీ చిల్లర బుద్ధి ఎక్కడ పోతది అంటూ దారుణంగా కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.ఇక దీనికి శివ జ్యోతి ఏమని స్పందిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube