కూతురుతో వీడియో షేర్ చేసుకున్న హరితేజ.. దయచేసి మీ నటన ఆపండంటూ దారుణమైన ట్రోల్స్?

కొంతమంది సెలబ్రెటీలకు ఎంతమంది అభిమానులు ఉన్నప్పటికీ కూడా.వాళ్లను ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉంటారు.

 Netizens Comments On Hariteja Cute Video With Her Daughter Viral Details, Harite-TeluguStop.com

ఎందుకంటే ఆ సెలబ్రెటీల ప్రవర్తన అందరికీ నచ్చాలని ఉండదు కాబట్టి.అలా ఎవరైనా సెలెబ్రెటీలు ఏం చేసినా కూడా వారిని ఎవరో ఒకరు టార్గెట్ చేస్తూ ఉంటారు.

ఇక అటువంటి లిస్టులో  హరి తేజ ఒకరు.హరితేజ ఏం చేసినా కూడా కొందరు మాత్రం బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఈమెను ఓ నెటిజన్ విమర్శించినట్లు కనిపించారు.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

బుల్లితెర నటి, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే.యాంకర్, డాన్సర్, యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది హరితేజ.2007లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.ఆ తర్వాత తన నటనకు ఎన్నో అవకాశాలు అందుకుంది.

సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది హరితేజ.

ఇక బుల్లితెరలో మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా.దాదాపు ఏడు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.అంతేకాకుండా బుల్లితెర లో పలు షోలలో కూడా  యాంకరింగ్ చేసింది.

ఇక 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో కూడా నటించింది హరితేజ.

ఇక ఈమెకు పెళ్లయి ఒక పాప కూడా ఉంది.

పెళ్లి తర్వాత కూడా తన నటనను మాత్రం అసలు వదులుకోలేదు.భర్త సపోర్టుతో ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతూనే ఉంది.

అంతేకాకుండా ఈ వయసులో కూడా గ్లామర్ షో చేస్తూ ఉంటుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే హరితేజ.

తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.

తీరిక సమయం దొరికితే చాలు తన కూతురితో ఆడుకుంటున్న వీడియోలను పంచుకుంటుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ వాటిని కూడా సోషల్ మీడియాలో పంచుకుంటుంది.ఈ వయసులో కూడా ఈమె ఇలా రెడీ అవ్వడంతో చాలామంది ఈమెను విమర్శిస్తూ ఉంటారు.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన కూతురితో ఆడుకుంటున్న ఒక వీడియోను పంచుకుంది.

అందులో తన కూతురిని తన మీద కూర్చోబెట్టుకొని ఉండగా.తను వేసుకున్న బట్టలు మాత్రం చాలా షార్ట్ గా అనిపించాయి.

దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్స్ కొందరు బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఓ నేటిజన్.

ముందు నువ్వు డ్రెస్సు బాగా వేసుకో అమ్మ తల్లి అంటూ కామెంట్ చేయగా మరో నెటిజన్.టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస్ట్ యాక్టర్ వి నువ్వు దయచేసి యాక్టింగ్ ఆపు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు.

ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube