ఎప్పుడు చూసిన అవి షేర్ చేస్తూనే ఉంటారా.. విగ్నేష్ శివన్ పై కామెంట్స్!

ఎవరైనా సరే సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు షేర్ చేస్తుంటే చూసే వాళ్లకు బాగా చిరాకు పుడుతుంది.అది సామాన్య ప్రజలే కానీ సెలబ్రెటీలే కానీ.

 Netizens Comments On Director Vignesh Shivan Social Media Posts Details, Vignesh-TeluguStop.com

సోషల్ మీడియా ప్రభావం బాగా ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారారు.ప్రతి ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఇక సెలబ్రెటీలు మాత్రం తను ఏమి చేసిన ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటున్నారు.తమ సినిమా విషయాలనే కాకుండా వాళ్ళు తిరిగిన టూర్ ల ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటూ ఉంటారు.

మరికొందరు మాత్రం తమకే సోషల్ మీడియా ఖాతా ఉన్నట్లు ఏవి పడితే అవి షేర్ చేస్తూ ఉంటారు.ఏది నచ్చితే అవి షేర్ చేస్తూ చిరాకు పుట్టిస్తుంటారు.

మరికొందరు నిత్యం ఒకటే స్టైల్ ను ఫాలో అవుతుంటారు.ఇలా ఉంటే డైరెక్టర్ విగ్నేష్ శివన్ కూడా ఇలాగే సోషల్ మీడియా ప్రియులను చిరాకు పెట్టిస్తున్నాడు.

అసలు విషయం ఏంటంటే.కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్, లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విగ్నేష్ శివన్.

Telugu Vignesh Shivan, Kollywood, Lady Nayanthara, Netizens, Vignesh Sivan-Movie

ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు.మంచి మంచి సక్సెస్ లతో ముందుకు దూసుకుపోతున్నాడు.చాలావరకు స్టార్ హీరోల సినిమాలు చేశాడు.నిజానికి స్టార్ హీరోలు కూడా ఈయన సినిమాలపై బాగా ఆసక్తి చూపిస్తారు.

తాను చేసిన సినిమాలలో తన భార్య కూడా నటించింది.

అలా ఆ సమయంలో వారి మధ్య ప్రేమ ఏర్పడగా కొన్ని సంవత్సరాలు సహజీవనం చేసి ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒకటయ్యారు.ఎంతోమంది కుటుంబ సభ్యులతో, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల సమక్షంలో వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

Telugu Vignesh Shivan, Kollywood, Lady Nayanthara, Netizens, Vignesh Sivan-Movie

ఇక విగ్నేష్ పెళ్లికి ముందు నుండే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాడు.పైగా తన భార్య నయనతార ఫోటోలను కూడా బాగా పంచుకునే వాడు.అంతేకాకుండా ఇతర వాటికి సంబంధించిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాడు.పెళ్లి తర్వాత కూడా ఆయన సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారాడు.

ప్రతిరోజు ఆయన ఏదో ఒక పోస్ట్ చేయకుండా నిద్రపోడు అని చెప్పాలి.ఆయన చేసే పోస్టులన్నీ కాస్త విచిత్రంగానే అనిపిస్తాయి.

అవసరమైన పోస్టులను షేర్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది.కొన్ని ఫన్నీ వీడియోలను కూడా పెడుతూ ఉంటాడు.

దీంతో ఈయన పోస్టులను చూసిన చాలా మంది నెటిజన్లు డైరెక్టర్ వై ఉండి సినిమా అప్డేట్ల గురించి తెలిపాలి కానీ ఎప్పుడు ఇలాంటి పోస్టులను ఎందుకు షేర్ చేస్తున్నారు అని చిరాకు పడుతున్నారు.ఆ పోస్టుల వల్ల ఎటువంటి లాభం లేదు అంటూ ఆ పోస్టులను చూడటం టైం వేస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube